బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ జబర్దస్త్ కార్యక్రమం లో( Jabardasth Show ) ఉన్న సమయం లో స్టార్ డం దక్కించుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్.( Sudigali Sudheer ) ఈయన జబర్దస్త్ లో అడుగు పెట్టిన చాలా తక్కువ సమయం లోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.
పైగా యాంకర్ రష్మి తో( Rashmi ) ప్రేమ వ్యవహారం కలిగి ఉన్నాడు అన్నట్లుగా ప్రచారం జరగడం తో సుడిగాలి సుదీర్ యొక్క స్థాయి అమాంతం పెరిగింది.ఇక సుడిగాలి సుదీర్ బుల్లి తెర పై సూపర్ స్టార్ గా దూసుకు పోతున్న సమయం లోనే హీరో గా కూడా అవకాశాలు వచ్చాయి.
ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు కమెడియన్ గా నటించిన సుడిగాలి సుదీర్ హీరో గా అవకాశాలు వస్తుండడం తో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యాడు.

ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే జబర్దస్త్ కార్యక్రమం లో చేస్తున్నప్పుడే అతడికి అవకాశాలు అనేవి వచ్చాయి.కనుక జబర్దస్త్ కార్యక్రమాన్ని ఎప్పుడైతే మానేశాడో అప్పటి నుండి సినిమాల్లో అవకాశాలు కూడా రావడం తగ్గి పోయింది.ఒకటి రెండు సినిమాల్లో ఛాన్స్ వస్తే.
ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.దాంతో సుడిగాలి సుదీర్ అసలు ఇండస్ట్రీలో ఉన్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొన్నాళ్లుగా ఇతను కనిపించక పోవడం వల్ల అభిమానులు పై విధంగా అనుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.జబర్దస్త్ కార్యక్రమం నుండి వెళ్లి పోయినందుకు గాను సుడిగాలి సుదీర్ ఇప్పుడు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు అంటూ స్వయంగా ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కల్ప వృక్షం వంటి జబర్దస్త్ కార్యక్రమాన్ని సుడిగాలి సుధీర్ వదిలేసి ఎంత పెద్ద తప్పు చేశాడో అతడికి కూడా ఇప్పటికే అర్థమయి ఉంటుంది.అందుకే ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న వారు తమంతట తాముగా వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు.