టిడిపి , జనసేన( TDP, Jana Sena ) పొత్తుల భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ , మూడు పార్లమెంట్ స్థానాలను టిడిపి కేటాయించింది .ఈ నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.ఇక జనసేన మిగిలిన 19 స్థానాలలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తూనే ఉంది .అదీ కాకుండా అసలు జనసేన ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది ? ఆ 19 నియోజకవర్గాల్లో ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే నిన్న టిడిపి అధినేత చంద్రబాబుతో( Chandrababu ) పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో ఇద్దరు ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

అయితే జనసేన రెండు సీట్ల విషయంలో గట్టిగా పట్టుపడుతుండడంతో దీనిపై ఇంకా తద్దినభర్జన జరుగుతోందట.ఆ రెండు స్థానాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉండడంతో , మిగిలిన 17 నియోజకవర్గాల పై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇందులో అన్ని జిల్లాలలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కే విధంగా చూస్తున్నారట.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 6 , తూర్పుగోదావరిలో 5 , విశాఖ జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో రెండు , శ్రీకాకుళం , విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప , అనంతపురం జిల్లాలో ఒక్కోచోట జనసేనకు సీటు కేటాయించినట్లు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ విజయనగరంలో( Palakonda in Vizianagaram ) నెలిమర్ల విశాఖలో విశాఖ దక్షిణ /పెందుర్తి/ మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, తూర్పుగోదావరిలో కాకినాడ రూరల్ రాజోలు రాజానగరం అమలాపురం / పి.గన్నవరం పిఠాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం , భీమవరం, తాడేపల్లిగూడెం , ఉంగుటూరు ,నిడదవోలు , పోలవరం, కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ , అవనిగడ్డ, గుంటూరులో తెనాలి, ప్రకాశంలో దర్శి , చిత్తూరులో తిరుపతి, అనంతపురంలో అనంతపురం , కడప జిల్లాలో రైల్వే కోడూరులో జనసేన పోటీ చేయబోతుందట .ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి సీటును జనసేన ఆశిస్తోంది.అయితే ఆ స్థానానికి బదులు మాడుగుల స్థానాన్ని తీసుకోవాలని టిడిపి ప్రతిపాదించిందట.అలాగే అమలాపురం సీటును జనసేన కోరుతుండగా, దానికి బదులు పి.గన్నవరం తీసుకోవాలని టిడిపి ప్రతిపాదించగా దీనిపైన పవన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.