కాంగ్రెస్ లో చేరండి కానీ... ? పీకే కు కండీషన్లు ?

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనను చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది.

 It Is The Supremacy Of The Party That Has Imposed Many Conditions For Prashant K-TeluguStop.com

ప్రశాంత్ కిషోర్ చేరితో కేంద్రంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, నిరాశ నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.త్వరలోనే ప్రశాంత్ కిషోర్ చేరిక లాంఛనం కాబోతోంది.

అయితే ఆయన చేరిక, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే విషయంపై ప్రశాంత్ కిషోర్ నివేదికలపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం త్రిసభ్య కమిటీని నియమించింది.
  ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ చేరాలంటే పూర్తిగా తమ పార్టీకి మాత్రమే పని చేయాలని , ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ కమిటీ షరతులు విధించింది.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ రాజకీయ వ్యూహాలను అందిస్తోంది.  తెలంగాణలో టీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాలను అందిస్తున్నారు.

కానీ ఇక పై కాంగ్రెస్ కు మాత్రమే రాజకీయ వ్యూహాలు అందించాలనే కండీషన్ పెట్టారట.ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పీకే చేరిక పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని చూస్తున్నారు.  అయితే కాంగ్రెస్ కండిషన్ల ను ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకునే అవకాశం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 

Telugu Aicc, Congress, Rahul Gandhi, Sonia Gandhi, Telangana-Telugu Political Ne

ఎటువంటి కండిషన్లు లేకుండా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపిస్తున్నట్లు ఏఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంలో ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అధ్యయనం చేస్తున్నారు .దీనిపై మరికొద్ది రోజుల్లోనే సోనియాకు నివేదిక అందించబోతున్నారు.దీని తర్వాతే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరే విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది.

అలాగే ఆయన పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఆయనకు కట్టబెట్టాలని సోనియా నిర్ణయించారు .ఇప్పుడు కాంగ్రెస్ విధించిన కండిషన్ లపైనే ప్రశాంత్ కిషోర్ ఆలోచనలోపడ్డారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube