భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది.రేపు మధ్యాహ్నం 2.19 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-55 ప్రయోగం చేపట్టనుంది.ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 12.49 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.కాగా 25.30 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది.
షార్ లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్ఎల్వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానంను శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు.
అయితే సింగపూర్ కు చెందిన టెలియోస్-2, లూమి లైట్ -4 ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపించనున్నారు.