తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సేవలను చేసి ఎన్నో సాహస ప్రయోగాత్మక చిత్రాలను పరిచయం చేసిన నటుడు నట శేఖర్ కృష్ణ గారు అని చెప్పాలి.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.
ఇలా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగినటువంటి కృష్ణ సుమారు 350 సినిమాల్లో నటించారు.లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో పాటు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నంది అవార్డులు వరించాయి.
అదేవిధంగా 2008వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
ఇక 2009వ సంవత్సరంలో ఈయనకు పద్మ భూషణ్ బిరుదుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
అయితే ఈ పద్మభూషణ్ రావడం వెనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హస్తం ఉందని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో కృష్ణ వెల్లడించారు.తన కూతురు మంజులతో కలిసి నిర్వహించిన చిట్ చాట్ లో భాగంగా కృష్ణ తనకు వచ్చినటువంటి పద్మభూషణ్ గురించి తెలియజేశారు.
పద్మభూషణ్ అవార్డు గురించి మంజుల ప్రశ్నించగా తాను పద్మ భూషణ్ అవార్డు కోసం ప్రయత్నాలు చేయలేదని అయితే 2009వ సంవత్సరంలో ఓ సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారిని కలవగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేస్తున్న మీకు ఇప్పటివరకు పద్మభూషణ్ రాకపోవడం చాలా బాధాకరం అని తనతో అన్నారు.అదేవిధంగా అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారితో ఈయన మాట్లాడి తనకు పద్మభూషణ్ రావడానికి కారణమయ్యారని కృష్ణ వెల్లడించారు.ఈ విధంగా కృష్ణ గారికి పద్మభూషణ్ రావడం వెనుక వైయస్సార్ హస్తము ఉందని తెలుస్తోంది.