రాజధానులపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే విశాఖపట్నం రాజధానిగా ప్రకటన వస్తుందన్నారు.
ఈ మేరకు చీఫ్ సెక్రటరీ పరిపాలన రాజధానిపై ప్రకటన చేస్తారని చెప్పారు.విశాఖ రాజధానిని అడ్డుకునేందుకు కొందరు దొంగ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
విశాఖ రాజధానిని ఉభయగోదావరి జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.రాజధానికి న్యాయపరమైన అడ్డంకులు త్వరలో తొలగిపోతాయన్నారు.
కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పడుతుందని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆయన వెల్లడించారు.