ముందు నుంచి అనుకున్నట్లుగానే సీనియర్ నేతల విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) కఠిన నిర్ణయం తీసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవడమే ప్రామాణికంగా తీసుకుంటున్న చంద్రబాబు అన్ని మొహమాటలను పక్కనపెట్టి గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు దీని కనుగుణంగానే నిన్న ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టారు.
అక్కడ కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వగా , మరికొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టారు.దీంతో చంద్రబాబు నిర్ణయం పై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి చూసుకుంటే సీనియర్ నేత కళా వెంకట్రావు( Kala Venkat Rao, ) పేరు తొలి జాబితాలో లేదు.అక్కడ కొత్త వారిని ఎంపిక చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు .స్థానికంగా నియోజకవర్గంలో కళా వెంకట్రావు పార్టీ క్యాడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడంతో, ఆయనను పక్కన పెట్టినట్లు తెలిసింది .మరో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు .
ఇక నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా జాబితాలో లేదు.ఆయన వరుసగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం , ఓటమి చెందడం వంటివి చోటు చేసుకుంటూ ఉండడంతో, ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం .ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించిన వారికి మాత్రమే సర్వేపల్లి సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.అందుకే సోమిరెడ్డిని పక్కన పెట్టారు.
ఇక గురజాల నియోజకవర్గం నుంచి చూసుకుంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు పేరు కూడా జాబితా నుంచి తప్పించారు.అక్కడ వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి టిడిపిలో చేరే అవకాశం ఉండడంతో, ఆయనకు టికెట్ ఇవ్వాలని ఆలోచనతో యరపతినేని పేరును తప్పించారట.
ఆయనకు నరసరావుపేట టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా( Devineni Uma ) పేరు కూడా తొలి జాబితాలో లేదు.మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో ఈనెల 26వ తేదీన చేరే అవకాశం ఉండడంతో, ఆయనకు మైలవరం నుంచి పెనమలూరుకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నారట.అలాగే మండలి బుద్ధ ప్రసాద్ పేరు కూడా జాబితాలో లేదు.
ఇక్కడ వంగవీటి రాధాను పోటీకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.గంటా శ్రీనివాసరావు తో పాటు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ,పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరికొంతమంది సీనియర్ నేతల పేర్లు లేకపోవడం తో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.