కోమటిరెడ్డితో కాంగ్రెస్ కు ముప్పేనా ?

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy )వ్యవహార శైలి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.కొన్ని సందర్భాల్లో పార్టీకి ఎంతో విధేయత ప్రదర్శిస్తూ మరికొన్ని సందర్భాల్లో పార్టీ పై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతూ ఉంటారు.

 Is Komati Reddy A Threat To Congress , Komatireddy Venkat Reddy , Bjp , Brs-TeluguStop.com

దీంతో వెంకన్న ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థంకాక హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు.మునుగోడు బైపోల్ సమయంలో పార్టీలో ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలపాకు పాల్పడరనే ఆరోపణతో షోకాజ్ నోటీసులు కూడా ఎదుర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

ఇంకా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తో కూడా తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు.

Telugu Congress, Komati Venkat, Revanth Reddy-Politics

దాంతో ఆయన కాంగ్రెస్( Congress party ) కు గుడ్ బై చెబుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి.అయితే ఆ తరువాత జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పార్టీ వీడే ఆలోచనను విరమించుకున్నారు వెంకటరెడ్డి.ఆ తరువాత తెలంగాణలో కలిసికట్టుగా పార్టీకి విజయాన్ని తీసుకొస్తామని తమ మద్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతూ పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు.

కానీ ఆయా కమిటీలలో కోమటిరెడ్డికి స్థానం కల్పించలేదు అధిస్థానం.ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిటీ లోనూ అలాగే రాష్ట్ర ఎన్నికల కమిటీలోనూ అలాగే స్క్రినింగ్ కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించలేదు అధిష్టానం.

Telugu Congress, Komati Venkat, Revanth Reddy-Politics

దీంతో మళ్ళీ అలకబూని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అయితే ఆయా కమిటీలలో ఆయనకు చోటు కల్పించకపోవడానికి కారణం.కోమటిరెడ్డిపై అధిష్టానానికి నమ్మకం లేకపోవడమే కరణమనేది కొందరి అభిప్రాయం.పార్టీ బలహీనంగా ఉన్న టైమ్ లో కోమటిరెడ్డి పార్టీకి ఎలాంటి మేలు చేయలేదని.ఇప్పుడెమో అన్నీ తానై చూసుకుంటున్నాట్లు వ్యవహిస్తున్నారని కొంతమంది హస్తం నేతలు అధిష్టానం ముందు వాపోయారట.దీంతో ఎప్పుడెలా వ్యవహరిస్తారో అర్థం కానీ కోమటిరెడ్డి పార్టీకి ముప్పే అని భావించి కావాలనే అధిస్థానం పక్కన పెడుతున్నట్లు టాక్.

మరి ఎన్నికల ముందు కోమటిరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube