గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెగ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరిని ఎన్నుకోవాలని ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది.అయితే గతేడాది ఫిబ్రవరిలో కూడా పంజాబ్‌లో ఆప్ సర్వే నిర్వహించింది.
ప్రజాభిప్రాయాన్ని సేకరించి అభ్యర్థి ఎంపిక చేసింది.అలా పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ వ్యూహాన్నే ప్రస్తుతం గుజరాత్‌లోనూ ఇంప్లిమెంట్ చేస్తోంది ఆప్.
ఈ క్రమంలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఎవర్ని కోరుకుంటారనే విషయాన్ని చెప్పాలని ప్రజలకు నలుగురి పేర్లను సూచించారు.182 స్థానాలున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది చివరన జరగనున్నాయి.ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్.
.నలుగురు అభ్యర్థుల పేరును ప్రకటించారు.
వీరిలో ఎవర్ని ప్రజలు ఎక్కువగా సజెస్ట్ చేస్తారో? అతడినే సీఎం అభ్యర్థిగా నిలబెట్టనున్నారు.ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కోరారు.
అయితే పంజాబ్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వేలో భగవంత్ మాన్‌ను ఎక్కువ మంది మద్దతు తెలిపారు.దీంతో పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయాన్ని సాధించింది.

నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.నవంబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.కాగా, ఈ సారి గుజరాత్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో పలు ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహిస్తోంది.గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ఆప్ ఉచితంగా విద్య, విద్యుత్, వైద్యం అందిస్తుందన్నారు.ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో ఈ హామీలు పూర్తి చేశామని, గుజరాత్‌లో అధికారంలోకి వస్తే తప్పకుండా హామీలు నెరవేరుస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.