మునుగోడు ఉపఎన్నికలో అసాధారణమైన విచిత్ర పరిస్థితి నెలకొందని మంత్రి కేటీఆర్ అన్నారు.ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ ఎనిమిదేళ్లలో తామేం చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నామన్నారు.అయితే బీజేపీ వాళ్లు వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనేనని విమర్శించారు.







