కరోనా కారణంగా దుబాయ్ వెళ్ళిన ఐపీఎల్ ఇప్పుడు క్లైమాక్స్ కొచ్చేసింది.ఇక ఈసారి ఐపీఎల్ లో ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ కుర్రాళ్లంతా ఇరగకొడితే సీనియర్ ప్లేయర్స్ అంతా దాదాపు చేతులు ఎత్తేశారు.
ఈసారి కప్ కొడుతుంది అనుకున్న ఆర్.సి.బి కలలను ఎస్.ఆర్.హెచ్ చెరిపేసింది.పాపం ఈసారి ప్లేయర్స్ ను ఇంజూరిస్ వెంటాడుతున్న బాగా కష్టపడి క్వాలిఫైయర్ 2 వరకు చేరుకున్న ఎస్.ఆర్.హెచ్ కు ఢిల్లీ బ్రేక్ వేసింది.అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి ఐపీఎల్ లో బోలెడు విషయాలే ఉన్నాయి.వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం.అదే ఈసారి ఐపీఎల్ లో మనల్ని నిరాశ పరిచిన ప్లేయర్స్ ఎవరో?ఒకవేళ వాళ్ళు ఫామ్ లోకి వచ్చివుంటే ఏం జరిగేదో ఇప్పుడు చూద్దాం.
ధోని :

బెస్ట్ కెప్టెన్ అనే పదానికి సరైన ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని.అలాంటి ధోని ఈసారి ఐపీఎల్ లో బ్యాటింగ్ చేసిన మ్యాచ్ లలో ఒకే ఒక మంచి స్కోర్ కనిపిస్తుంది.ప్రతి సీజన్ ధోని ఇచ్చే ఫినిషింగ్ ఈ సీజన్ లో ఫ్యాన్స్ బాగా మిస్ అయ్యారు.దాని కారణంగానే సూపర్ కింగ్స్ త్వరగా ఐపీఎల్ నుండి నాకౌట్ అయ్యింది.
వాట్సన్ :

ఓపెనర్ గా వరసగా విఫలమవుతున్న సూపర్ కింగ్స్ వాట్సన్ ను నమ్మి అతనికి బోలెడు ఛాన్స్ లు ఇచ్చింది.కాని దాన్ని వాట్సన్ నిలబెట్టుకోలేకపోయాడు.వరసగా విఫలమయ్యాడు.
డేల్ స్టెయిన్ :

ఒకప్పుడు తన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిన డేల్ స్టెయిన్ ను ఈ సీజన్ లో బ్యాట్స్ మెన్ టార్గెట్ చేసి కొట్టారు.దాని ఫలితంగానే టాప్ టు స్పాట్స్ లో ఉండాల్సిన ఆర్.సి.బి ఫోర్త్ ప్లేస్ కు చేరింది.పాయింట్స్ టేబుల్ లో ఇంకో అవకాశం వచ్చే పొజిషన్ లో లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దినేష్ కార్తిక్ :

నైట్ రైడర్స్ గా కెప్టెన్ గా ఐపీఎల్ ను మొదలుపెట్టిన దినేష్ కార్తిక్ ఫామ్ లో లేకపోవడంతో వరస పరాజయాలు మూటగట్టుకున్నాడు.దీనితో కెప్టెన్ గా తప్పుకున్నాడు.అయినా ఫాంలోకి రాలేక సీజన్ అంత ఇబ్బందిపడి అందరినీ నిరాశపరిచాడు.
ఆండ్రూ రస్సెల్ :

నైట్ రైడర్స్ ఫినిషర్ గా పేరున్న ఆండ్రూ రస్సెల్ ఈసారి బ్యాటింగ్ లో ఆ పేరును నిలబెట్టుకోలేకపోయినా బౌలింగ్ లో కొంతమేర రాణించాడు.
కేదార్ జాదవ్ :

సూపర్ కింగ్స్ తరుపున మిడిలార్డర్ లేదా లోయర్ ఆర్డర్ లో ఆడడానికి వచ్చి మెరుపులు మెరిపించే జాదవ్ ఈ సీజన్ లో పూర్తిగా విఫలమయ్యాడు.
ఆరోన్ ఫించ్ :

ఆర్.సి.బి తరుపున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ అసలు ఏమాత్రం రాణించలేదు.బౌలింగ్ విషయంలో ఉన్న తలనొప్పులకు తోడు ఈ సీజన్ లో ఇతని బ్యాటింగ్ ఆర్.సి.బి కు మరింత తలనొప్పిగా మారింది.
ప్యాట్ కమ్మిన్స్ :

ఆక్షన్ లో రికార్డ్ ప్రైజ్ పలికిన ఈ ఆస్ట్రేలియన్ పేసర్.నైట్ రైడర్స్ ను నిరాశ పరిచాడు.ఈ సీజన్ లో కమ్మిన్స్ వికెట్స్ తీయకపోగా కొన్ని మ్యాచ్ లలో భారీ పరుగులు ఇచ్చి టీమ్ ను నిండా ముంచాడు.
నవదీప్ సైని :

చాహాల్ తర్వాత ఆర్.సి.బి లో బాగా బౌలింగ్ చేసే ప్లేయర్ గా పేరున్న సైని ఈ సీజన్ లో వికెట్లు తీయలేక బాగా ఇబ్బంది పడ్డాడు.దీనితో మిగతా బౌలర్స్ పై ప్రెషర్ పడడం వాళ్ళు రాణించలేకపోవడంతో మొదటికే మోసం వచ్చింది.
శివమ్ దుబే :

మొన్నటి వరకు నేషనల్ టీమ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు రీప్లేస్మెంట్ గా శివమ్ దుబేను అందరూ భావించారు.అలాంటి శివమ్ దుబే ఈ సీజన్ లో ఆ మార్క్ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.