ప్రపంచ దేశాలలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోకుతున్న సంగతి విదితమే.కొన్ని రోజుల క్రితం స్టార్ హీరోయిన్ తమన్నా కరోనా బారిన పడ్డారు.
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో తమన్నా చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.తాజాగా తమన్నా కరోనా సోకిన సమయంలో తన అనుభవాల గురించి చెబుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కరోనా సోకిన సమయంలో తనకు చనిపోవాలని అనిపించిందని తమన్నా పేర్కొన్నారు.తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురయ్యానని.కరోనా సోకిన వ్యక్తుల్లో కనిపించే లక్షణాలతో పోలిస్తే తనలో ఎక్కువగా లక్షణాలు కనిపించాయని తెలిపారు.కరోనా వల్ల లైఫ్ అంటే ఏంటో తనకు అర్థమైందని.
అలాంటి కఠినమైన పరిస్థితుల్లో తోడుగా ఉన్న తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు.
తనకు కరోనా సోకి చికిత్స పొందుతున్న సమయంలో చనిపోతాననే ఆలోచనలే ఎక్కువగా వచ్చేవని అన్నారు.
వైద్యుల కృషి ఫలితంగానే తాను వైరస్ నుంచి కోలుకున్నానని తమన్నా తెలిపారు.అయితే కరోనా సమయంలో తీసుకున్న మందులు శరీరంపై ప్రభావం చూపడంతో తాను లావయ్యానని ఆమె చెప్పారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తే కొందరు తాను లావుగా ఉన్నానని కామెంట్ చేశారని పేర్కొన్నారు.
అలా కామెంట్ చేసిన సమయంలో చాలామంది అవతలి వ్యక్తుల లోపాలనే వెతుకుతూ ఉంటారని.
అవతలి వ్యక్తి ఆరోగ్యం, ఇతర పరిస్థితుల గురించి అస్సలు ఆలోచించరని అనిపించిందని తమన్నా అన్నారు.తమన్నా ప్రస్తుతం సీటీమార్, అంధాధూన్ రీమేక్, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తున్నారు.
కరోనా గురించి తమన్నా చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.మరోవైపు నేడు మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.