రియల్ హీరో సోనూసూద్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కొన్నేళ్ల క్రితం వరకు సోనూసూద్ ఎవరనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి విలన్ పాత్రలు వేసే టాలీవుడ్ నటుడు అనే సమాధానం వినిపించేది.అయితే లాక్ డౌన్ సమయంలో చేసిన సహాయ కార్యక్రమాల ద్వారా సోనూసూద్ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.

 Interesting Facts About Real Hero Sonusood Details Here Goes Viral, Ishan, Ayan,-TeluguStop.com

నిన్న సోనూసూద్ పుట్టినరోజు కాగా సోనూసూద్ గురించి అభిమానులకు సైతం చాలా విషయాలు తెలియవు.పంజాబ్ రాష్ట్రంలోని మోగా అనే ప్రాంతంలో సోనూసూద్ జన్మించారు.

సోనూసూద్ తండ్రి పేరు శక్తి సాగర్ సూద్ కాగా ఆయన క్లాత్ షోరూమ్ కు యజమానిగా పని చేశారు.సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ ప్రొఫెసర్ కాగా అక్క మోనిక సైంటిస్ట్ కావడం గమనార్హం.

నాగ్ పూర్ లో బీటెక్ పూర్తి చేసిన సోనూసూద్ 23 సంవత్సరాల వయస్సులోనే సోనాలి సూద్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.నటుడిగా గుర్తింపు రాకముందే సోనూసూద్ కు ఇద్దరు కొడుకులు పుట్టగా వాళ్ల పేర్లు ఇషాన్, అయాన్ కావడం గమనార్హం.

సోనూసూద్ తాజాగా శక్తి సాగర్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ను మొదలుపెట్టి ఆ బ్యానర్ లో ఫతే అనే యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో సోనూసూద్ హీరో కాగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఎక్స్‌ప్లర్గర్ పేరుతో సోనూసూద్ సొంత సోషల్ మీడియా యాప్ ను మొదలుపెట్టారు.

Telugu Ayan, Ishan, Nagpur, Sagar Sood, Sonali, Sonusood, Tollywood-Movie

సోనూసూద్ భార్య సోనాలి ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.కరోనా సమయంలో వేల సంఖ్యలో ప్రజలకు సహాయం చేయడం ద్వారా సోనూసూద్ వార్తల్లో నిలిచారు.ఐ యామ్ నో మెస్సయ్య పేరుతో లాక్ డౌన్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి సోనూసూద్ పంచుకున్నారు.

సోనూసూద్ కు రోజుకురోజుకు ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube