ఈ మామిడిపళ్ళు చాలా కాస్ట్లీ గురూ..!

పండ్లకు రారాజుగా మామిడి పండును చెబుతారు.అందులోనూ కింగ్​ ఆఫ్​ మ్యాంగోగా రత్నగిరి హపూస్​ మామిడి పండ్లు పేరుగాంచాయి.

 Interesting Facts About Ratnagiri Mangoes And Its Price Details, Mangos, Too Cos-TeluguStop.com

ఈ మామిడి పండ్లు మామిడి సీజన్ కంటే ముందుగానే మార్కెట్లోకి వస్తాయి.ప్రతి సంక్రాంతికి ఈ మామిడి పండ్లు అమ్ముడుపోతాయి.

ఈ ఏడాదిలో కాస్త ముందే అవి వచ్చేశాయి.మామూలుగా సంక్రాంతికి రావాల్సిన ఈ మామిడి పండ్లు జనవరి మొదటి వారంలోనే విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలియజేశారు.

‘కొంకణ్ రాజు’గా ఈ మామిడి పండ్లు ప్రసిద్ధి చెందాయి.ఈ మామిడి పండ్లు పుణె మార్కెట్​లో మనకు దొరుకుతాయి.ఇవి నాలుగు డజన్లు సుమారు రూ.15 వేలకు అమ్ముడవుతున్నాయి.మామూలుగా మనం చూస్తే రత్నగిరి హపూస్ రకం మామిడి పండ్లు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు చేతికి వస్తాయి.అయితే ఈ సంవత్సరం మాత్రం ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషం.

వాతావరణంలో మార్పుల కారణంగా జనవరి మొదటి వారంలోనే ఇవి మార్కెట్లోకి వచ్చేశాయని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా చూస్తే ఈ మామిడి పండ్ల సీజన్​ ప్రారంభమయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల టైం ఉంది.

అయితే గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఈ మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం లేదు.ఈ సంవత్సరం మాత్రం రత్నగిరి మామిడి పండ్లు అనుకున్నదానికంటే ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషంగా చెప్పొచ్చు.

పుణెలోని దేశాయ్ బ్రదర్స్ యజమాని అయిన మందర్ దేశాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ సంవత్సరంలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.వీటికి డిమాండ్ కూడా బాగానే ఉందని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల వీటికి డిమాండ్​, సప్లై బాగా తగ్గిందని, లాక్​డౌన్​ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై ఆగిపోతుందని వ్యాపారులు తెలిపారు.

ఈ ఏడాదిలోనైనా వీటికి డిమాండ్ పెరుగుతోందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.

Interesting Facts about Hapus Mangoes From Ratnagiri #Mangoes

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube