ఈ మామిడిపళ్ళు చాలా కాస్ట్లీ గురూ..!

పండ్లకు రారాజుగా మామిడి పండును చెబుతారు.అందులోనూ కింగ్​ ఆఫ్​ మ్యాంగోగా రత్నగిరి హపూస్​ మామిడి పండ్లు పేరుగాంచాయి.

ఈ మామిడి పండ్లు మామిడి సీజన్ కంటే ముందుగానే మార్కెట్లోకి వస్తాయి.ప్రతి సంక్రాంతికి ఈ మామిడి పండ్లు అమ్ముడుపోతాయి.

ఈ ఏడాదిలో కాస్త ముందే అవి వచ్చేశాయి.మామూలుగా సంక్రాంతికి రావాల్సిన ఈ మామిడి పండ్లు జనవరి మొదటి వారంలోనే విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలియజేశారు.

'కొంకణ్ రాజు'గా ఈ మామిడి పండ్లు ప్రసిద్ధి చెందాయి.ఈ మామిడి పండ్లు పుణె మార్కెట్​లో మనకు దొరుకుతాయి.

ఇవి నాలుగు డజన్లు సుమారు రూ.15 వేలకు అమ్ముడవుతున్నాయి.

మామూలుగా మనం చూస్తే రత్నగిరి హపూస్ రకం మామిడి పండ్లు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు చేతికి వస్తాయి.

అయితే ఈ సంవత్సరం మాత్రం ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషం.వాతావరణంలో మార్పుల కారణంగా జనవరి మొదటి వారంలోనే ఇవి మార్కెట్లోకి వచ్చేశాయని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా చూస్తే ఈ మామిడి పండ్ల సీజన్​ ప్రారంభమయ్యేందుకు ఇంకా రెండు, మూడు నెలల టైం ఉంది.

అయితే గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఈ మామిడి పండ్లు మార్కెట్లోకి రావడం లేదు.

ఈ సంవత్సరం మాత్రం రత్నగిరి మామిడి పండ్లు అనుకున్నదానికంటే ముందుగానే మార్కెట్లోకి రావడం విశేషంగా చెప్పొచ్చు.

పుణెలోని దేశాయ్ బ్రదర్స్ యజమాని అయిన మందర్ దేశాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

"""/" / ఈ సంవత్సరంలో మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ముందుకు వస్తున్నారని తెలిపారు.

వీటికి డిమాండ్ కూడా బాగానే ఉందని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల వీటికి డిమాండ్​, సప్లై బాగా తగ్గిందని, లాక్​డౌన్​ విధిస్తే సుమారు 10 నుంచి 15 శాతం మేర సప్లైపై ఆగిపోతుందని వ్యాపారులు తెలిపారు.

ఈ ఏడాదిలోనైనా వీటికి డిమాండ్ పెరుగుతోందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.

12 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న మహిళ.. చివరికి ఎన్ని కోట్లు తగిలాయంటే..??