భోజనంతో పాటు జామకాయను తింటే ఏమవుతుందో తెలుసా?

జామకాయను పేదవాడి ఆపిల్ అని అంటారు.జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

 Health Benefits Of Eating Guavas-TeluguStop.com

నిమ్మ,నారింజ వంటి వాటిలో ఉండే విటమిన్ సి కంటే 10 రేట్లు విటమిన్ సి జామకాయలో ఉంటుంది.అంతేకాక జామకాయలో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌,ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

జామకాయలో ఉండే పోషకాలు అన్ని మన శరీరానికి చాలా బాగా సహాయపడతాయి.అలాగే మధుమేహం ఉన్నవారు కూడా చాలా హ్యాపీగా జామకాయను తినవచ్చు.

అలాంటి జామకాయను భోజనంతో తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.అయితే బాగా పండిన జామకాయను మాత్రమే తీసుకోవాలి.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా తింటూ ఉంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే బాగా పండిన పండును మాత్రమే తినాలి.

జామపండులో ఉన్న పోషకాలు రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి దాంతో శరీరంలో అన్ని శరీర భాగాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది.

శరీరం బాగా అలసినప్పుడు 50 గ్రాముల జామ గుజ్జులో 10 గ్రాముల తేనే కలిపి తింటే వెంటనే అలసట తగ్గిపోతుంది.

రాత్రి పడుకొనే ముందు బాగా పండిన జామకాయను తింటే జీర్ణశక్తి బాగా పెరగటమే కాకుండా మెదడు ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది.

బాగా పండిన జామపండులో గింజలను తీసేసి దానిలో పాలు,తేనే కలిపి మిక్సీ చేసి పెరిగే పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదలకు అవసరమైన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube