ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధ వాతావరణం : తక్షణం వెనక్కి వచ్చేయండి, భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

ప్రస్తుతం ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని.

 India's Travel Advisory For Citizens, Students In Ukraine Amid Crisis , Ukraine--TeluguStop.com

బుధవారం యుద్ధం తప్పదని అమెరికా సారథ్యంలోని నాటో దళాలు డేట్‌తో హెచ్చరిస్తున్నాయి.అదే జరిగితే రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నాటో హెచ్చరిస్తోంది.

ఇప్పటికే ఉక్రెయిన్ బోర్డర్ వద్దకు నాటో భారీగా సైనికులను, అధునాతన యుద్ధ సామాగ్రిని మోహరించింది.దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

అటు వివిధ దేశ ప్రభుత్వాలు.ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌ను రష్యా ఏ క్షణమైనా ఆక్రమించుకోవచ్చని అమెరికా హెచ్చరించటంతో అనేక దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కు రప్పిస్తున్నాయి.తాజాగా పలు దేశాలు ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులను కూడా రద్దుచేశాయి.

ఈ లిస్ట్‌లో ఇండియా కూడా వుంది.ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు తక్షణం స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం హెచ్చరించింది.

ఈ మేరకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

రష్యా- ఉక్రెయిన్‌ మధ్య అగ్గి రాజుకున్నప్పటి నుంచి పరిస్ధితులను నిశితంగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం… ఎప్పటికప్పుడు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది.ఉక్రెయిన్‌లోని భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ఇప్పటికే కోరింది.దానితో పాటు తమ క్షేమ సమాచారాల్ని వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్‌డేట్‌ చేయాలంటూ భారత పౌరులకు విజ్ఞప్తి చేసింది.

ఏమైనా సాయం కావాలంటే సోషల్‌ మీడియాలోనూ సంప్రదించవచ్చని భారత ప్రభుత్వం సూచించింది.

ఇకపోతే.తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు అక్కడ 200 మంది వరకు వున్నారు.వీరంతా ఉక్రెయిన్‌లో మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్నారు.

ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ ఉండలేక, చదువులను మధ్యలో వదిలేసి రాలేక ఆందోళనకు గురవుతున్నారు.మరికొద్ది రోజుల్లో కొత్త సెమిస్టర్ ప్రారంభమవుతుందని, ఇలాంటి పరిస్ధితుల్లో చదువులను మధ్యలో ఎలా వదిలేసి రాగలమని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube