అలాంటి స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? ఇక వాటిలో జీపీఎస్‌ ఉండదు?

స్మార్ట్ ఫోన్( Smart Phone ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఇక్కడ చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటో తెలియనివారు వుండరంటే అతిశయోక్తి కాదేమో! ఇక స్మార్ట్ ఫోన్లలో వాడే జీపీఎస్‌ టెక్నాలజీ( GPS ) అమెరికాదన్న విషయం విదితమే.

 India Govt To Implement Navic Gps Support For All Smart Phones Details, Smart Ph-TeluguStop.com

ఈ జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్‌’ ( Navic ) సాంకేతిక పరిజ్ఞానం మొట్టమొదటిసారిగా ఐఫోన్‌15 ద్వారా భారత్‌లో అందుబాటులోకి ఇపుడు రాబోతున్నది.వైమానిక, సముద్ర, భూగోళ రవాణా, సైంటిఫిక్‌ పరిశోధన, సర్వేయింగ్‌, లొకేషన్‌ సేవలు, వ్యక్తిగత రవాణా, వనరుల పర్యవేక్షణ మొదలైన వాటిపై ‘నావిక్‌’ అప్లికేషన్‌తో సేవలు అనేవి అందుతాయి.

Telugu Alternative, India, Iphone, Isro, Navic Gps, Navic Smart, Gps, Smart Phon

దీనికోసం 2018లో ఇస్రో( ISRO ) 7 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది.దేశీయ తయారీ నావిక్‌ అప్లికేషన్‌ను సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్లు తీసుకురావాలని భారత్‌ గతకొంత కాలంగా శామ్‌సంగ్‌, షావోమీ, యాపిల్‌ తయారీ సంస్థల్ని కోరుతున్న సంగతి వినే వుంటారు.కాగా త్వరలో అది కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది.ఈ మార్పులు జరిగిన తరువాత మీరు ఇంతవరకు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో దేశీయ జి‌పి‌ఎస్ అనేది పనిచేయదు.ఎందుకంటే అప్పటికే అందులో విదేశీయ సాఫ్ట్ వేర్ పనిచేస్తు వుంటుంది కనుక.అందుకే కేంద్ర ప్రభుత్వం ఇపుడు దేశీయ స్మార్ట్ ఫోన్లను ప్రోత్సహించడానికి కంకణం కట్టుకుంది.

Telugu Alternative, India, Iphone, Isro, Navic Gps, Navic Smart, Gps, Smart Phon

అయితే ఈ మార్పులు చేర్పులు ఎప్పుడు వస్తాయో అన్న విషయంపైన మాత్రం క్లారిటీ లేదు.ఒకవేళ వచ్చినప్పటికీ మీరు పాత ఫోన్లను పక్కన పడేయవలసిన అవసరం లేదు.యధా విడిగా వాడుకోవచ్చు.కాకపోతే వాటిలో దేశీయ జి‌పి‌ఎస్ అనే వర్క్ కాదు.అంతమాత్రాన పాత జి‌పి‌ఎస్ విధానం పనిచేయదనీ కాదు.కాకపోతే ఖచ్చితత్వం లోపించవచ్చుగాక.

ఇక ఖచ్చితత్వంతో కూడిన జి‌పి‌ఎస్ నెట్ వర్క్ కావాలనుకున్నవారు మాత్రం రాబోయే కొత్త అడిషన్లు కొనుగోలు చేసినట్టైతే ఆయా మార్పులను గమనించగలరు.అయితే దానికోసం కాస్త వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube