లండన్‌లో ఇండియా- యూకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ కీలక భేటీ

ఇరుదేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించేందుకు గాను భారత్ – యూకేలు మంగళవారం లండన్ వేదికగా డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించినట్లు యూకేలోని భారత హైకమీషన్ తెలిపింది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ , యూకే రక్షణ మంత్రిత్వ శాఖకు శాశ్వత కార్యదర్శి.

 India And Uk Hold Defence Consultative Group Meet In London , London, India , Uk-TeluguStop.com

ప్రధాన పౌర సలహాదారు డేవిడ్ విలియమ్స్‌తో కలిసి ఇండో యూకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ (డీసీజీ) సమావేశానికి అధ్యక్షత వహించారు.వివిధ సేవా స్థాయి ద్వైపాక్షిక సమూహాలు, ఇతర రక్షణ సహకార యంత్రాంగాల పురోగతిని ఇరుదేశాలు సమీక్షించినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది.

కాగా.జూలై ప్రారంభంలో .భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ యూకే భద్రతా సలహాదారు స్టీఫెన్ లవ్‌గ్రోవ్‌ను కలుసుకున్నారు.ద్వైపాక్షిక , ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అనేక విషయాలపై వీరిద్దరూ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

సైబర్ భద్రత, సముద్ర, ఇండో- పసిఫిక్‌లో సహకారం, ప్రాంతీయ భద్రత, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు.ఇండో – యూకే రోడ్ మ్యాప్‌ 2030 అనుగుణంగా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, గణనీయమైన ఫలితాలు సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలని ఇరుదేశాలు అంగీకరించాయి.

ప్రధాని మోడీ, అప్పటి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌ లక్ష్యాలపై దృష్టి సారించి సాంకేతికత, రక్షణ రంగాలలో ముందుకు సాగడంపైనా డీసీజీ సమావేశంలో చర్చించారు.

ఇకపోతే.ఇటీవల బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.లిజ్ ట్రస్ వాణిజ్య మంత్రిగా వున్న సమయంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, అలాగే రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టం కావాలని మోడీ ఆకాంక్షించారు.2030కి సంబంధించి రోడ్ మ్యాప్ అమలు.రక్షణ, సెక్యూరిటీ రంగాల్లో సహకారం వంటి వాటిపైనా యూకే ప్రధానితో మోడీ చర్చించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube