రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.. అసలు విషయం చెప్పిన బిగ్ బాస్ మానస్

టాలీవుడ్ ప్రేక్షకులకు బుల్లితెర, వెండితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ గురించి అందరికీ పరిచయమే.బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు.

 Im In A Relationship Big Boss Manas Said Real Truth , Manas , Bigg Boss , Relati-TeluguStop.com

అంతే కాకుండా విపరీతమైన ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం మానస్ పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.

మానస్ మొదటిసారి నరసింహ నాయుడు సినిమా బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.ఆ పై వచ్చిన వీడే, అర్జున్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత రవి శర్మ దర్శకత్వంలో వచ్చిన ఝలక్ లో ప్రధాన నటుడుగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

Telugu Arjun, Bigg Boss, Child Artist, Koilamma, Manas, Priyanka, Ravi Sharma, R

అలా గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు, గోలీసోడా వంటి చిత్రాల్లో తన నటనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.కేవలం వెండితెరపై కాకుండా బుల్లితెరలో కూడా కోయిలమ్మ సీరియల్ లో నటించి ఆ సీరియల్ తో మంచి సక్సెస్ అందుకున్నాడు.బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని మరింత పరిచయం పెంచుకుని మరిన్ని అవకాశాల తో ముందుకు దూసుకుపోతున్నాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మానస్ ఎంతో సహనంతో తన ఆటను ఆడాడు.నిజానికి నెగిటివిటీ ముద్రను కూడా మోయలేదని చెప్పాలి.ముఖ్యంగా మరో కంటెస్టెంట్ ప్రియాంక తో తన మూవింగ్ ఎలా ఉందో చూసాం.ప్రియాంక తన మాయలో పడగా తను మాత్రం ప్రత్యేక యాటిట్యూడ్ తో ప్రియాంక ను హ్యాండిల్ చేశాడు.

Telugu Arjun, Bigg Boss, Child Artist, Koilamma, Manas, Priyanka, Ravi Sharma, R

కానీ వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నిజమైతే బాగుండు అని కొందరు ప్రేక్షకులు కూడా అనుకున్నారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మానస్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు కూడా ప్రియాంకతో తనకున్న స్నేహం గురించి చెప్పిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఓ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి సినిమాలు తీయాలని ఉందంటూ తన కోరికను కూడా తెలిపాడు.

ప్రస్తుతం మానస్ ఆ పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక మానస్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలు బాగా పంచుకుంటాడు.

అప్పుడప్పుడు అభిమానులతో కూడా బాగా ముచ్చటిస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన అభిమానులతో కాసేపు ముచ్చటించాడు.

Telugu Arjun, Bigg Boss, Child Artist, Koilamma, Manas, Priyanka, Ravi Sharma, R

అందులో తన అభిమానులు తన గురించి అడగవలసిన ప్రశ్నలు అడిగారు.ఇక ఓ అభిమాని తనను. రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడగటం తో అవును అని అన్నాడు.అది కూడా తన అభిమానులతో, తన మంచి కోరుకునే వాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాను అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు.

ఇక ప్రస్తుతం ఆయన ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube