దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శరత్ కుమార్ ( Sarath Kumar) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా తిరిగి రాజకీయాలలోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నటుడు శరత్ కుమార్ సైతం రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈయన ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి అనే రాజకీయ పార్టీని ఎప్పుడో స్థాపించారు.గతంలో శరత్ కుమార్ MLA గా, రాజ్యసభ ఎంపీ గా కూడా పనిచేశారు.

తాజాగా తన పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి వార్షిక మహాసభలు మధురైలో జరిగాయి.ఈ క్రమంలోనే మధురైలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వింత హామీలు ఇచ్చారు.ప్రజలు తనని నమ్మి తనకు ఓట్లు వేసి తనని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేస్తానని శరత్ కుమార్ ప్రకటించారు.
ఆదాయం కోసం తాను మద్యపానాన్ని నమ్ముకోనని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు అంతేకాకుండా తన గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

ప్రస్తుతం తన వయసు 70 సంవత్సరాలు అని కానీ తాను ఇప్పటికి చాలా యాక్టివ్ గా ఉండడమే కాకుండా పాతికెళ్లా కుర్రాడి లాగా ఉంటానని తెలియజేశారు.తాను ఇంకా 150 సంవత్సరాలు బ్రతకగలనని అందుకు తాను ఒక ట్రిక్ నేర్చుకున్నానని తెలియజేశారు.అయితే తమిళనాడు ప్రజలు తనని ముఖ్యమంత్రిగా( Cheif Minister ) గెలిపిస్తే ఎక్కువ కాలం బ్రతికే ఆ ట్రిక్ మీకు కూడా చెబుతాను అంటూ ఈ సందర్భంగా శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాజకీయ నాయకులు( Politicians ) ఎన్నో శపథాలు చేయడం చూశాము కానీ ఇలా 150 సంవత్సరాల పాటు బ్రతకడానికి ట్రిక్ చెబుతామంటూ ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు హామీ ఇవ్వలేదంటూ ఈయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో పలువురు విమర్శలు కురిపిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.