బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) కత్రినా కైఫ్ (Katrina Kaif) జంట ఒకటి.వీరిద్దరూ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అయితే వీరిద్దరూ నిజజీవితంలో కూడా ఒకటైన విషయం మనకు తెలిసిందే.ఇలా సెలబ్రిటీలో పెళ్లిళ్లు చేసుకుంటే వారిద్దరిని జంటగా సినిమాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
అయితే తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన జరహట్ కే జరబచ్ కే (Jarahat Ke Zarabach ke) సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కాబోతుంది.

ఈ సినిమాజూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్ (Laxman Utekaar)కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈ సినిమా సినిమాలో విక్కీకి జంటగా సారా అలీఖాన్ (Sara Ali Khan) నటిస్తోంది.టిపికల్ మిడిల్ క్లాస్ భార్యాభర్తల మధ్య ఎంటర్టైన్మెంట్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ భార్య భర్తలుగా నటించారు ఈ క్రమంలోనే సారా అలీ ఖాన్ బదులు విక్కీ కౌశల్ భార్యగా కత్రినా కైఫ్ ను ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ కత్రినా కైఫ్ ఫారెన్ రిటర్న్. ఆమె మనకు ఎక్కడైనా కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా కనపడుతుందా?కత్రినా కైఫ్ మిడిల్ క్లాస్ అమ్మాయిల ఏ కోశాన కనిపించదు కనుక ఈ సినిమాలో విక్కీకి భార్యగా తనని తీసుకోలేదని తెలిపారు.వ్యక్తిగతంగా వీరిద్దరి జోడి చాలా పర్ఫెక్ట్ అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం విక్కీ కౌశల్ కు కత్రినా కైఫ్ సరైన జోడి కాదని అనిపించింది అందుకే తాను ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కత్రినా కైఫ్ ను తీసుకోలేదు అంటూ డైరెక్టర్ చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.