ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గాను అలాగే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నటువంటి ఈయన తన టాలెంట్ తో హీరోగా అవకాశాలను అందుకున్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.ఇక తాజాగా ఈయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో రవితేజ ఈ సినిమాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.అయితే తాజాగా రవితేజ గురించి నటుడు కమల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో హీరోగా నటించిన కమల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన రవితేజ గురించి పలు విషయాలను తెలియచేశారు.
రవితేజ గారు ఇప్పుడు ఎంత ఎనర్జీగా ఉన్నారో అప్పుడు కూడా అంతే ఎనర్జీగా ఉండేవారు.అయితే అప్పుడు కాస్త లావుగా ఉండేవారని కమల్ వెల్లడించారు.రవితేజ ఎప్పటికప్పుడు తనని మార్చుకుంటూ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నారని ఈయన తెలిపారు.క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఉంటారు.అయితే ఈయన పెద్దగా బయట తిరగడానికి ఇష్టపడరు.కెరియర్ మొదట్లో తాను హైదరాబాదులో తనకు ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలని చెప్పేవారు.
అయితే ఈయన మాత్రం ఇప్పుడు ఏకంగా 12 కోట్లు ఖరీదు చేసే ఇంటిలో నివసిస్తున్నారు అంటూ కమల్ చెప్పడంతో రవితేజ ఉంటున్నటువంటి ఇల్లు 12 కోట్ల విలువ చేస్తుందని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.