అలా జరగకపోతే నా స్టూడియో గోదాంల మారిపోతుంది..రెహమాన్ షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఏఆర్ రెహమాన్( A.R Rahman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందిస్తూ ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.ఇక రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అంటే ఆ సినిమా సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే.

 If That Doesnt Happen My Studio Will Be Warehoused Rahman, Nepotizem, A.r Rahman-TeluguStop.com

రెహమాన్ సంగీతం( Music ) అంటే చెవి కోసుకొని అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇలా వరుస సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రెహమాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.ముఖ్యంగా నెపోటిజం( Nepotizem ) గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న విషయం మనకు తెలిసిందే.హీరో పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీ లోకి రావడం మ్యూజిక్ డైరెక్టర్ పిల్లలు మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీ లోకి రావడం సర్వసాధారణంగా జరుగుతుంది.

అయితే నెపోటిజం అనేది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా ఉంది.అయితే సినిమా ఇండస్ట్రీలోనే నెపోటిజం గురించి చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా నెపోటిజం గురించి రెహమాన్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Ar Rahman, Music, Nepotizem, Studio-Movie

ఈ సందర్భంగా నెపోటిజం గురించి రెహమాన్ మాట్లాడుతూ… మనం చేసే వృత్తిని కచ్చితంగా మన పిల్లలకు నేర్పించాలని ఈయన తెలియజేశారు.నేను చేసే పని పట్ల నా పిల్లలకు అవగాహన లేకపోతే నేను ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి నా స్టూడియో( Studio ) ఒక గోదాంలా మారిపోతుంది.నేను నా స్టూడియోలో సంగీత పరికరాలు అన్నింటితో ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను నా పిల్లలకు వాటిపై అవగాహన లేకపోతే, వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే స్టూడియో ఒక గోదాంలా ఉంటుందని రెహమాన్ తెలిపారు.

Telugu Ar Rahman, Music, Nepotizem, Studio-Movie

నా స్టూడియోలో ప్రతి అంగుళాన్ని ప్రతి వస్తువును ఎంతో కష్టపడిఏర్పాటు చేసుకున్నాను అందుకే భవిష్యత్తులో నా పిల్లలు కూడా దీనిని ఉపయోగించాలని తాను కోరుకుంటానని ఈయన తెలిపారు.వారు ఇదే వృత్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.వారసత్వమనేది లేకపోతే ఎన్నో విషయాలు అదృశ్యమవుతాయి.

ఇక నేను నా పిల్లలతో ఆర్థికపరమైన విషయాలను కూడా పంచుకుంటానని తెలిపారు.అయితే ఇవన్నీ వారిని విసిగించడానికి కాకుండా వారికి కూడా ప్రతి ఒక్క విషయం తెలియాలన్న ఉద్దేశంతోనే వారితో ప్రతి ఒకటి చర్చించుకుంటానని ఈ సందర్భంగా రెహమాన్ నెపోటిజం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube