ఇన్వెస్టర్స్‌పై కనక వర్షం కురిపించిన ఆ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్.. ఐదేళ్లలో 240% రిటర్న్స్..!

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ( ICICI Prudential PMS Contra Strategy ) అనే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అద్భుతమైన రిటర్న్స్ అందించి ఇన్వెస్టర్లను తన వైపు తిప్పుకుంటోంది.ఇది మార్కెట్లో అండర్ పెర్‌ఫార్మ్ చేస్తున్న స్టాక్‌లను( Stocks ) కొనుగోలు చేయడంపై దృష్టి సారించే ఒక రకమైన పెట్టుబడి సర్వీస్.

 Icici Prudential Pms Contra Strategy Scheme Can Generate 240 Percent Returns In-TeluguStop.com

తక్కువగా పెర్ఫార్మ్ చేస్తున్న కొన్ని స్టాక్స్ అనేవి లాంగ్ రన్‌లో మంచిగా పర్ఫామ్‌ చేస్తాయని గుర్తించి ఇది ఇన్వెస్ట్ చేస్తుంది.తద్వారా హై రిటర్న్స్ అందిస్తుంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ ఐదేళ్ల క్రితం ప్రారంభించినప్పటి నుంచి 20% వార్షిక రాబడిని అందించింది.ఉదాహరణకు, మీరు 2018లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీలో రూ.1 కోటి పెట్టుబడి పెట్టి ఉంటే, 2023 సెప్టెంబర్ 14 నాటికి మీ పెట్టుబడి మొత్తం దాదాపు రూ.2.4 కోట్లు అయి ఉండేది.అయితే, ఈ పెట్టుబడికి సంబంధించి ఎల్లప్పుడూ కొంత రిస్క్ ఉంటుంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ కూడా దీనికి మినహాయింపు కాదు.కాగా ఈ స్ట్రాటజీ ట్రాక్ రికార్డ్ హై రిటర్న్స్( High Returns ) జనరేట్ చేయడానికి ఇది మంచి మార్గం అని సూచిస్తుంది.

Telugu Contrarian, Returns, Iciciprudential, Portfolio-General-Telugu

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ 2018, సెప్టెంబర్ 14న లాంచ్ అయింది.ఇది లాంచ్ అయిన సమయం నుంచి 240% రిటర్న్స్ అందించింది.మరోవైపు SP BSE 50 TRI ఐదేళ్లలో 1100% అందించింది.దీన్నిబట్టి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ గత ఐదేళ్లలో మార్కెట్‌ను అధిగమించిందని చెప్పవచ్చు.

Telugu Contrarian, Returns, Iciciprudential, Portfolio-General-Telugu

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ సూపర్ సక్సెస్ అయింది.ఎందుకంటే ఇది వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటో అనుబంధాలు, లాజిస్టిక్స్, కార్పొరేట్ బ్యాంకులు, యుటిలిటీల వంటి తయారీ, సంబంధిత పరిశ్రమలలో పెట్టుబడి( Investment ) పెట్టడంపై దృష్టి పెట్టింది.ఈ రంగాలు ఇటీవలి సంవత్సరాలలో తక్కువ విలువను కలిగి ఉన్నాయి, కానీ అవి మంచి ఆదాయ అవకాశాలను అందిస్తూ ఆకర్షణీయమైన రిటర్న్స్‌కు దారి తీస్తాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ PMS కాంట్రా స్ట్రాటజీ పోర్ట్‌ఫోలియోలో 2023, ఆగస్టు 31 నాటికి 24 సెలెక్టెడ్ స్టాక్‌లు ఉన్నాయి.

పోర్ట్‌ఫోలియో కేటాయింపులో టాప్ 10 స్టాక్‌లు 56% వాటాను కలిగి ఉన్నాయి.మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, పోర్ట్‌ఫోలియోలో 53.2% పెద్ద క్యాప్ స్టాక్‌లలో, 25.6% స్మాల్-క్యాప్ స్టాక్‌లలో, 21.2% మిడ్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube