టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్నపై విజయవాడ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) పరోక్ష విమర్శలు చేశారు.పాపులార్టీ కోసం కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే తన స్థాయికి తక్కువ గల మనుషుల గురించి తాను మాట్లాడనని కేశినేని నాని తెలిపారు.
చీటర్స్, కాల్ మనీ చేసే వారి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని చెప్పారు.తన స్థాయికి చంద్రబాబు ( Chandrababu )మాట్లాడితే చెప్తానన్నారు.నారా లోకేశ్( Nara Lokesh ) కూడా తన స్థాయికి తక్కువని తెలిపారు.
ఎన్నికలు అయ్యాక ఎవరి పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుందని వెల్లడించారు.