డెట్రాయిట్ నగరంలో ఇండియన్ అమెరికన్ కూటమి వారి ఆధ్వర్యంలో ఫండ్ రైజర్

డెట్రాయిట్ నవంబర్ 10 : ఇటీవల డెట్రాయిట్ నగరంలో ఇండియన్ అమెరికన్ కూటమి వారి ఆధ్వర్యంలో జరిగిన Governor Grethchen Whitmer ఫండ్ రైజర్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది.డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500ల మందికి పైగా అమెరికన్లు మరియు భారతీయ సంతతికి చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.
ధవల్ వైష్ణవ్, అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని తదీతర సభ్యుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా గవర్నర్ Gretchen Whitmer తో పాటూ, కాంగ్రెస్ ఉమన్ హ్యాలీ స్టీవెన్స్ , బ్రెండా లారెన్స్ మరియు మిచిగాన్ సెక్రటరీ అఫ్ స్టేట్ జోసెలిన్ బెన్సన్ అథితులుగా విచ్చేసారు.ఇందులో వందలలో వ్యాపారవేత్తలు పాల్గొన్నారు .ఈ సభ మిచిగన్ బిజినెస్ లో భారతీయుల ఉనికిని,సత్తాని ఎత్తి చూపింది.
గవర్నర్ ఫండ్ కోసం విరాళాలు సేకరించడానికి మొత్తం మిచిగన్ బిజినెస్ కమ్యూనిటీ అంత ఒక త్రాటి మీదకు వచ్చి, 238 K విరాళ సేకరణ తో రికార్డ్ స్థాపించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ రెప్‌ పద్మ కుప్ప మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విట్మర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

Telugu Detroit, Raiserprogram, Nris-Telugu NRI

ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టు అమెరికన్ జాతీయ గీతం తో పాటు భారత జాతీయ గీతాన్ని అశోక్ బడ్డి గారి ఆధ్వర్యంలో పాడిన పిల్లలు అందరినీ ఎంతగానో అలరించి, సభా స్ఫూర్తి కి వన్నె తెచ్చారు.పలు నాట్య ప్రదర్శనలు,సమైక్య గీతాలు అందర్నీ రంజింప చేసాయి.ఈ విధమైన సభలు ప్రవాస భారతీయుల ఉనికిని భవిష్యత్తు ప్రణాళికల్ని పటిష్టం చేస్తాయని, US రాజకీయాలలో నూతనావకాశాలతో మన పాత్రని పెంచి పటిష్టం చేయడానికి దోహద పడతాయని, అంతే కాకుండా మన సంస్కృతి, జీవన విధానం గురించి అవగాహన పెరిగి అమెరికాలో ప్రస్తుత మరియు రాబోయే కాలంలో ప్రవాసుల అభివృద్ధికి ఎంతో ఉపకరిస్తాయని కార్యనిర్వాహకులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube