ద్రాక్షలో చేదుకుళ్ళు వ్యాధి ను అరికట్టేందుకు సస్యరక్షక పద్ధతులు..!

ద్రాక్ష పంటకు( Grapes Crop ) తీవ్ర నష్టం కలిగించే చేదుకుళ్ళు వ్యాధి( Bitter Rot ) అనేది ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.ఈ ఫంగస్ ( Fungus ) అనేది పంట యొక్క అవశేషాలలో జీవించి ఉంటుంది.

 How To Treat Bitter Rot Disease In Grapes Details, Bitter Rot Disease ,grapes,-TeluguStop.com

పంట పొలంలో చెత్త పై పెరుగుతూ ఫంగస్ కణజాలం బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది.ఇక తేమ, వెచ్చని, వర్షపు పరిస్థితులు లాంటి వాతావరణ పరిస్థితులు ఈ ఫంగస్ ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయి.

ద్రాక్ష పండ్లు పరిపక్వత చెందితే వాటిపై ముదురు రంగు గాయాలు కనపడితే ఈ చేదుకుళ్ళు వ్యాధి సోకినట్లు నిర్ధారించుకోవాలి.తర్వాత ఈ పండ్లు చేదుగా మారడం, పండు పై బూజు లాగా ఏర్పడడం జరుగుతుంది.

లేత పండ్లకు ఈ వ్యాధి సోకితే గోధుమ రంగులోకి మారుతాయి.తరువాత ఈ పండ్లపై నల్లటి పొక్కులు ఏర్పడి పైన ఉండే తొక్క చీలిపోతుంది.ద్రాక్ష మొక్కలపై ఎర్రటి రంగు మచ్చలు పసుపు రంగు వలయాలతో ఏర్పడతాయి.ఈ వ్యాధిని నివారించే పద్ధతులు ఏమిటో చూద్దాం.తెగులు నిరోధకతో కూడిన ఆలస్యంగా పరిపక్వతకు వచ్చే రకాలను సాగులను ఉపయోగించాలి.కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నివారించాలి.

మొక్కలకు గాలి బాగా వీచేటట్లు వరుసలను నాటాలి.

పంట వేసే ముందే ఇతర పంటల అవశేషాలను పొలం నుండి తొలగించాలి.ఈ వ్యాధిని నివారించడానికి ముందుగా సేంద్రీయ పద్ధతిలో ఫాస్పరస్ ఆమ్లం, పొటాషియం బై- కార్బోనేట్, పొటాషియం మోనోపాస్పేట్, ఆక్సిడేట్, కంపోస్ట్ టీ వంటి తక్కువ రిస్క్ ఉండే సమ్మేళనాలను ఉపయోగించాలి.రసాయన పద్ధతిలో ఈ వ్యాధిని నివారించాలి అంటే ఐప్రోడియన్ 75 డబ్ల్యూ జీ 0.2%, బిట్టర్ టనాల్ 25 డబ్ల్యూ పి 0.1%, థియో పనేట్ 0.1% లలో ఏదో ఒక దానిని లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి తొలి దశలోనే ఈ వ్యాధిని నివారిస్తేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube