మనలో చాలామంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం బాగా తెలిసిన వారే.అయితే చాలా మందికి ఫోన్ లో ఉన్న అనేక యాప్స్ ని ఎలా ఉపయోగించాలో చాలా వరకు తెలియదు.
ఇక స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎందుకు త్వరగా ఖర్చయిపోతుంది అన్న విషయంపై చాలా మందికి అవగాహన లేదు.ఇందుకు గల ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్ లో భారీ మొత్తంలో ర్యామ్ ఉన్నప్పటికీ కూడా బ్యాక్ గ్రౌండ్ లో కచ్చితంగా అప్లికేషన్స్ అవుతూనే ఉంటాయి.
దీనితో ప్రధానంగా ఎఫెక్ట్ పడేది బ్యాటరీ పైనే.కాబట్టి బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది.
అంతే కాదు ఇలా బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ ద్వారా మీ ఫోన్ స్లో అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
ముఖ్యంగా మనం గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అనేక రకాల యాప్స్ మన ఫోన్లో ఉన్నప్పటికీ వాటిని కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాము.
అయితే కొన్ని యాప్స్ మాత్రం వాటికి అవసరం లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ ల్ రన్ అయ్యే విధంగా పర్మిషన్ తీసుకుంటాయి.ఇందుకు ఒక ఉదాహరణ తీసుకుంటే మొబైల్ ఫోన్ లోని వాల్ పేపర్ అందించే యాప్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో రన్నింగ్ పర్మిషన్ తీసుకుంటుంది.
వీటి ద్వారా మన ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి కారణం అవుతుంది.కాబట్టి ఇలాంటి వాటిని గుర్తించి వాటిని బలవంతంగా అయినా సరే మీరు బ్యాగ్రౌండ్ లో రన్ కాకుండా చేసుకోవచ్చు.
ఇలా చేయాలంటే మొదటగా మన స్మార్ట్ ఫోన్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.ఇక అందులో బిల్డ్ నెంబర్ అనే ఆప్షన్ పై ఏడుసార్లు టచ్ చేయగా మనకి డెవలపర్ ఆప్షన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.ఇక ఆ తర్వాత డెవలపర్ ఆప్షన్స్ లోకి వెళ్లి అక్కడ కనిపించే రన్నింగ్ సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్లి చూడగా మీ ఫోన్లో ఏ అప్లికేషన్ ఎంత ర్యామ్, ఎంత బ్యాటరీ ఉపయోగిస్తున్నాయో మీకు కనబడుతుంది.ఇలా చూసుకున్న తర్వాత ఏ అప్లికేషన్ మీకు అవసరం లేదునుకుంటే ఆ అప్లికేషన్ సంబంధించి సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ స్టాప్ అని కనపడే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా అది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వకుండా పూర్తిగా నిలిపి వేయవచ్చు.
కావాలంటే ఫోర్స్ స్టాప్ అనే ఆప్షన్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.