Anushka Shetty : వరుస ఫ్లాప్స్‌ అందుకున్నా.. పడి లేచిన కెరటంలా దూసుకుపోయిన నటీనటులు వీరే…!

సినీ ఇండస్ట్రీలో జయపజయాలు అనేవి సర్వసాధారణం.అయితే సినిమా హిట్ అయితే మాత్రం అందులో నటించిన నటినటులకు మంచి క్రేజ్ వస్తుంది.

 How Flop Actors Turned Their Career-TeluguStop.com

ఒకవేళ సినిమా ప్లాప్ అయితే మాత్రం దాని ప్రభావం కచ్చితంగా ఆ సినిమా లో నటించిన నటినటులపై ఉంటుంది.అలా వరుస ప్లాప్ లతో బాధపడిన నటి నటులు ఎంతోమంది ఉన్నారు.

అయితే ఎన్ని ప్లాపులు వచ్చిన తట్టుకొని ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న నటులు కొంతమంది ఉన్నారు.వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సూపర్ ‘ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ అమ్మడు ‘అరుంధతి’ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని బాగా పాపులర్ అయింది.

ఈ సినిమా తరువాత ఆమె ఎన్నో సినిమా లో నటించింది.అయితే అరుంధతి తరువాత ఆమెకి మంచి హిట్ ఇచ్చిన సినిమా అంటే ‘ బాహుబలి ‘( Baahubali ) అనే చెప్పాలి.

ఆమె కెరీర్ లో అరుంధతి, బాహుబలి సినిమా లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు లేవని చెప్పాలి.

Telugu Anushka, Baahubali, Balakrishna, Flop Actors, Gabbar Singh, Laxminarasimh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రజల్లో పవన్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు.అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి కూడా ప్లాప్స్ బాధ తప్పలేదు.

కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కానీ ఖుషి తరువాత వచ్చిన ‘జానీ ‘ సినిమా ఘోరంగా పరాజయం పాలయింది.

ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ వరుస ప్లాపులను రుచి చూసాడు.దాదాపు 8 ఏళ్ళు ప్లాపుల బారిన పడిన తరువాత ‘గబ్బర్ సింగ్( Gabbar Singh )’ సినిమా తో మళ్లీ హిట్ అందుకున్నాడు.

అయితే వరుస సినిమా ప్లాపులు ఆయనని వెంటాడినప్పటికి పవన్ కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు
.

Telugu Anushka, Baahubali, Balakrishna, Flop Actors, Gabbar Singh, Laxminarasimh

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు.సమరసింహ రెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో యంగ్ హీరోలతో పోటీ పడ్డాడు బాలయ్య.ఇప్పటికి పోటీ పడుతూనే ఉన్నాడు.

అలాంటి బాలయ్య నటించిన ‘లక్ష్మినరసింహ( Laxminarasimha )’ నుండి ‘సింహ’ సినిమా వరకూ వరుస ప్లాప్స్ తో బాధపడ్డాడు బాలకృష్ణ.లక్ష్మినరసింహ కంటే ముందు కూడా ఆయనకి ప్లాప్స్ ఎదురయ్యాయి.

ఎన్ని ప్లాప్స్ వచ్చినప్పటికి బాలయ్య కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈ అమ్మడు ఎన్నో సినిమాలో నటించినప్పటికి ‘మహానటి‘ సినిమా మాత్రం ఆమెకి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది.ఆ తరువాత కీర్తి ఖాతాలో ఒక హిట్ కూడా పడలేదు.

ఈ మధ్య కీర్తి, మహేష్ తో కలిసి నటించిన ‘సర్కార్ వారి పాట’ సినిమా మాత్రం ఎవరేజ్ టాక్ ని తెచ్చుకుంది.ఈ అమ్మడు ఇప్పటికైనా తన ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని వేసుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube