తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక అల్లు అర్జున్ నటనకు, ముఖ్యంగా ఈయన డాన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.
అల్లు అర్జున్ అద్భుతమైన స్టెప్పులు వేస్తూ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.ఇలా అల్లు అర్జున్ డాన్స్ ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పాలి.
ఇకపోతే అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రముఖ నటుడు శ్యామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ అన్నయ్య పాత్రలో నటించిన శ్యామ్ తాజాగా అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… డాన్స్ విషయంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరినీ కంపేర్ చేస్తూ వీరిద్దరిలో పోలిస్తే అల్లు అర్జున్ కన్నా విజయ్ అద్భుతంగా డాన్స్ చేస్తారని ఈయన చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా ఒప్పుకుంటారంటూ ఈయన వెల్లడించారు.
విజయ్ చాలా సింపుల్ గా నాచురల్ గా డాన్స్ చేస్తారు కానీ అల్లు అర్జున్ ఒక పాటకు డాన్స్ చేయాలంటే ఎక్కువగా రిహార్సల్స్ చేస్తారని ఈయన తెలిపారు.తనతో పాటు కలిసి రేసుగుర్రం సినిమాలో తాను నటించానని ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తను చేయబోతున్న పాటలకు మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారని ఈ సందర్భంగా శ్యామ్ అల్లు అర్జున్ డాన్స్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.