శ్రీకాకుళం జిల్లాలోని నౌపడ రైల్వే స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.రైల్వే ఆస్తుల్లో ఆక్రమణ తొలగింపుకు అధికారులు సిద్ధం అయ్యారు.
అయితే ఈ తొలగింపులను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.80 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామంటూ ఇప్పుడు ఆకస్మాత్తుగా వీధిన పడేయవద్దంటూ వేడుకుంటున్నారు.ఓ వైపు జెసిబితో ఇల్లును బలవంతంగా రైల్వే అధికారులు కూల్చివేస్తుండగా… మరోవైపు ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ అంత టెన్షన్ టెన్షన్ గా మారింది.