రకుల్ ప్రీత్ ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అడుగుపెట్టి.ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Heroine Rakul Preet Hyderabad House Cost, Rakul Preet Hyderabad House, Rakul Pr-TeluguStop.com

తెలుగులో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.ఈ క్రమంలోనే తెలుగు మాత్రమే కాకుండా తమిళ,హిందీ భాషలలో పలు సినిమాలను చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని రోజులకే హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ ప్రస్తుతం రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఖరీదైన ఇంటిని కూడా కొన్నట్లు తెలుస్తోంది.

రకుల్ ప్రీత్ ఐదు సంవత్సరాల క్రితమే హైదరాబాదులో సొంత ఫ్లాట్ కొన్నారు.అన్ని సౌకర్యాలతో కూడిన ఈ ఫ్లాట్ ఇంద్రభవనంలా ఉంటుందని చెప్పవచ్చు.

అప్పట్లోనే రకుల్ ప్రీత్ సింగ్ ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఇంద్రభవనం లాంటి ఫ్లాట్ ను కొన్నట్టు తెలుస్తోంది.

Telugu Actressrakul, Cost, Rakulpreet, Rakul Preet-Movie

ప్రస్తుతం ఈ భామ పలు భాషలలో సినిమాలు తీయడం వల్ల కొద్ది రోజులు ముంబై, కొద్ది రోజులు హైదరాబాద్ లో వస్తుంది.హైదరాబాద్ లో షూటింగ్ ఉన్న సమయంలో ఇక్కడే నివసిస్తారు.తన అందచందాలతో అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న రకుల్ ప్రస్తుతం హిందీ తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.అదే విధంగా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube