సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాత్ర ఏమిటంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగులో పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Mahesh Babu Reveals Keerthi Suresh Character In Sarkaru Vaari Paata, Mahesh Babu-TeluguStop.com

ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సర్కారీ వారి పాట చిత్రం నుంచి టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ విడుదల చేసిన 24 గంటలలో 25 మిలియన్ల వ్యూస్ దక్కించుకొని ట్రెండ్ అవుతుంది.

ఈ టీజర్ లో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించి ప్రేక్షకులను మరింత సందడి చేశారు.అదేవిధంగా ఈ సినిమాలో మహేష్ కి జోడీగా మహానటి కీర్తిసురేష్ జతకట్టారు.“పడుకునే ముందు దిష్టి తీసుకోవడం మర్చిపోకండి అంటూ కీర్తి సురేష్ చెప్పిన డైలాగ్ మరెంతో మంది మహేష్ అభిమానులను ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.”అమేజింగ్ కో-స్టార్ మహేష్ అంటూ“మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Telugu Keerthi Suresh, Keerthisuresh, Mahesh Babu-Movie

కీర్తి సురేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంతోమంది నటీనటులు మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో అందరికీ థాంక్స్ చెప్పిన మహేష్ బాబు కీర్తి సురేష్ పోస్ట్ కు మాత్రం విభిన్న శైలిలో రిప్లై ఇచ్చారు.ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కు రిప్లై ఇస్తూ “థాంక్యూ కళావతి“అని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కీర్తి సురేష్ ను కళావతి అని సంబోధించడం తో సర్కారీ వారి పాట చిత్రంలో ఆమెపేరు కళావతి అని మహేష్ బాబు బయట పెట్టాడా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే టీజర్ లో ఎక్కడ కూడా నటీనటుల పేర్లు ప్రస్తావించలేదు.మొత్తానికి సర్కారీ వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube