ఈ మధ్య జనాలు మనీ మైండెడ్ అయి పోయారు.వాళ్లతో అవసరం ఉన్నంత సేపే ఎఫెక్షన్ చూపిస్తారు.
ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్టు ఉంటారు.సినిమా వాళ్లలో కూడా ఇలా చాలామంది ఉంటారు.
ప్రతి దానిని బిజినెస్ వే లోనే చూస్తారు.ఇప్పుడు వస్తున్న ముద్దుగుమ్మలు చాలా వరకు అలానే ఉన్నారు.
బిజినెస్ మైండ్ తో చాలా కమర్షియల్ గా ఉంటున్నారు.
తాజాగా పూజ హెగ్డే చేసిన పని మహేష్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.
మరి ఇంత కమర్షియల్ ఆహ్ అంటూ పూజా మీద సూపర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.అసలు ఏం జరిగిందంటే.నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపు కున్నారు.ఈ సందర్భంగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరు మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే దర్శకులు, హీరోయిన్స్ కూడా చాలా మంది సోషల్ మీడియాలో మహేష్ కు విషెస్ తెలిపారు.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన సినిమా అప్డేట్ లు కూడా ఫ్యాన్స్ కు ను బాగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమా నుండి టీజర్ వచ్చి అభిమానులను బాగా ఆకట్టుకుంది.అంతే కాదు 24 గంటల్లోనే 27 మిలియన్ వ్యూస్ దాటి రికార్డ్ సృష్టించింది.
అయితే అందరు శుభాకాంక్షలు తెలిపిన పూజా మాత్రం మహేష్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పలేదు.దీంతో ఫ్యాన్స్ పూజా పై సీరియస్ అయ్యారు.మహేష్ తో మహర్షి అనే సూపర్ హిట్ సినిమా తీసి మరి అస్సలు మహేష్ బాబు పుట్టిన రోజు నాడు స్పదించలేదని మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.కనీసం శుభాకాంక్షలు చెప్పాలని సెన్స్ కూడా లేదని తిట్టి పోస్తున్నారు.
అయితే ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా పూజా ను ప్రకటించగానే కొద్దీ సమయానికే మహేష్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.దీంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూజ మరి ఇంత కమర్షియల్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.