తెలుగులో గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని హీరోయిన్లలో పూజా హెగ్డే ( Pooja Hegde )ఒకరు కాగా పూజా హెగ్డేకు ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి.గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్( Guntur Karam, Ustad Bhagat Singh ) సినిమాలలో పూజా హెగ్డే అవకాశాలను తర్వాత రోజుల్లో కోల్పోయారు.
తెలుగులో పూజా హెగ్డే చేతిలో సినిమాలు లేవు.పూజా హెగ్డేకు కొత్త సినిమా ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సైతం సిద్ధంగా లేదు.
ఒకప్పుడు ఇండస్ట్రీలో పూజా హెగ్డేను అభిమానులు గోల్డెన్ లెగ్ అని పిలిచేవారు.ఇప్పుడు మాత్రం అభిమానులు ఆమెను ఐరన్ లెగ్ ( Iron leg )అని పిలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.పూజా హెగ్డే పారితోషికం తగ్గినా రిస్క్ ఎందుకని కొత్త సినిమా ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు అస్సలు ఇష్టపడటం లేదు.అయితే తాజాగా పూజా హెగ్డే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.
కడపలో ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ( shopping mall )కు పూజా హెగ్డే హాజరై సందడి చేశారు.అయితే ఈ షాపింగ్ మాల్ రిబ్బన్ కటింగ్ కు పూజా హెగ్డే ఏకంగా 40 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.సినిమా ఆఫర్లు తగ్గినా పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం తను హీరోయిన్ గా నటించిన సినిమాల పాటలకు డ్యాన్స్ లు వేసి ఈ బ్యూటీ మెప్పించారు.
పూజా హెగ్డేను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సోషల్ మీడియాలో సైతం పూజా హెగ్డేకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ఈ హీరోయిన్ కు రాబోయే రోజుల్లో పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.
రాధేశ్యామ్, ఆచార్య సినిమాల నుంచి పూజా హెగ్డే ఫ్లాపుల పరంపర మొదలైంది.