సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ( Victory Venkatesh ) ఉన్న గుర్తింపు అంతా కాదు.ఒకప్పుడు ఆయన చేసిన ఫ్యామిలీ సినిమాలు మంచి సక్సెస్ లు సాధించేవి.
ఇక అందులో భాగంగానే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు.ఇక వెంకటేష్ అంటే ఏ కాంట్రవర్సీ చేయకుండా సినిమాలు చేసుకుపోయే హీరోగా కావడం వల్ల ప్రేక్షకులందరిలో ఆయన మీద మంచి అభిప్రాయం ఉంటుంది.
ఇక ఒకనొక సమయంలో ఆయన ఒక హీరోయిన్ తో గొడవ పడాల్సిన అవసరం వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు.
దేవిపుత్రుడు సినిమా( Devi Puthrudu Movie ) సమయంలో అందులో హీరోయిన్ నటించిన అంజల జవెరి తో( Anjala Zaveri ) కలిసి ఒక చిన్న సీన్ చేస్తున్నప్పుడు వెంకటేష్ ఆమెతో గొడవ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆయన ఎన్నిసార్లు డైలాగ్స్ పర్ఫెక్ట్ గా పొట్రే చేసిన ఆమె టెక్ ల మీద టేక్ లు తీసుకోవడంతో వెంకటేష్ కొంచెం ఆమె పైన కోపానికి వచ్చినట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఎందుకు అంటే వెంకటేష్ కి ఎక్కువ సేపు సీన్ చేయడం అంటే చాలా చిరాకు పడుతుందట.అప్పటికే ఆయన 10 టేకు లు చేశాడు.
కాంబినేషన్ సీన్స్ కావడంతో ఇద్దరు పర్ఫెక్ట్ గా చేస్తేనే సీన్ బాగా వస్తుంది.కాబట్టి ఇద్దరు మొదటి నుంచి ఈ సినిమా చేస్తూ వచ్చారట.
అయినప్పటికీ పది టేకులు తీసుకున్న కూడా ఆమె పర్ఫెక్ట్ గా డైలాగ్ చేయలేకపోవడంతో వెంకటేష్ కొంచెం ఆమె పైన కోపానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఆమె 12 వ టెక్ ఓకే చేసి ఆ సీన్ ను ఫినిష్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలో వచ్చాయి.
దీంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాలు హిట్ సినిమాలు నమోదు చేయాలనే ఉద్దేశ్యం లో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది.