నేను చేసిన 2 తప్పులు అవే.. లేకుంటే నా కెరీర్ మరోలా ఉండేదన్న శ్రీరామ్..

శ్రీరామ్.ఒకప్పుడు చక్కటి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందాడు.చూడ్డానికి బాగుంటాడు.యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు.ఆయన నటించిన కొన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.వాస్తవానికి తను టాప్ హీరో అయ్యే క్వాలిటీస్ చాలా ఉండేవి .కానీ తను చేసిన కొన్ని పొరపాట్ల మూలంగా ఆయన కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు.తన కెరీర్ లో చేసిన పెద్ద తప్పు ఓ రెండు సినిమాలను చేయకపోవడం అంటాడు శ్రీరామ్.

 Hero Sriram About His Movie Mistakes , Sriram Hero , Movie Mistakes , Sriram-TeluguStop.com

ఇంతకీ ఆ సినిమాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నాడు శ్రీరామ్.ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు చెప్పాడు.రవితేజ- పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి.

ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.వాస్తవానికి ఈ సినిమాను చేయాల్సిందిగా తొలుత తనకు ఆఫర్ వచ్చిందని శ్రీరామ్ చెప్పాడు.

నిర్మాత కెఎల్ ఎన్ రాజు మీడియా సమావేశం పెట్టి మరీ నేను హీరోగా ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు.అయితే నేను అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ కు గురయ్యాను.

నాకు కాలిన చోట స్కిన్ పెట్టారు.అప్పటికి ఆ గాయాలు పూర్తిగా మానిపోలేదు.

ఈ నేపథ్యంలో సినిమాలో స్టంట్స్ చేయడం కష్టం అనిపించింది.కావాలంటే కొన్ని ఫైట్స్ తగ్గిద్దాం అని కూడా చెప్పారు.

కానీ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న కథలో ఫైట్స్ తగ్గిస్తే బాగా రాదని చెప్పాను.అదే సమయంలో రవితేజ కలిసి ఈ సినిమా చేస్తేనే బాగుంటుందని నాతో చెప్పాడు.

కానీ చేయలేక పోయాను.ఈ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటినీ నేను బాధపడుతున్నానని చెప్పారు.

అటు తమిళంలో కూడా మణిరత్నం సినిమాను చేసే అవకాశం వచ్చినా చేయలేక పోయాను.యువ సినిమా చేసేందుకు సైన్ చేశాను.కానీ ఫైర్ యాక్సిడెంట్ మూలంగానే ఈ సినిమాను కూడా వదులుకున్నాడు.నాకోసం 6 నెలలు వెయిట్ చేస్తానని చెప్పాడు.కానీ అప్పటికీ నా పరిస్థితి మారక పోవడంతో తీసుకున్న అడ్వాన్స్ వెళ్లి ఇచ్చేశాను.కానీ మణిరత్నం చాలా బాధపడ్డారు.

మంచి అవకాశాన్ని చేజార్చుకుంటున్నావు అన్నాడు.ఆయన అన్నట్లుగానే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని చెప్పాడు శ్రీరామ్.

Hero Sreeram Career Failure Reasons #Herosriram

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube