25 వేల రూపాయల కోసం 15 కిలోల వెండిని తాక‌ట్టు పెట్టిన డైరెక్ట‌ర్‌!

సాగర్.మంచి దర్శకుడు.శ్రీ‌ను వైట్ల‌, వి.వి.వినాయ‌క్‌, ర‌వి కుమార్ చౌద‌రి సహా పలువురు దర్శకులకు గురువు.ఆయన తెరకెక్కించి స్టువ‌ర్ట్‌ పురం దొంగ‌లు, ప‌బ్లిక్ రౌడీ, న‌క్ష‌త్ర పోరాటం, అమ్మ‌దొంగా, యాక్ష‌న్ నెం.1 లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి కూడా. దర్శకుడిగా వెలుగు వెలిగిన సాగర్.

 Unkown Facts About Director Sagar , Director Sagar, Financial Problems, Action-TeluguStop.com

ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు.రాకాసిలోయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సాగర్.

తన రెండో సినిమా డాకుతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు.మూడో సినిమా మాత్రం తనకు చాలా ఇబ్బందులను తెచ్చి పెట్టింది.ఆ సినిమా మరేదో కాదు.మావారి గోల.ఈ సినిమా మొదలు పెట్టిన నిర్మాతకు హిందీలో గోవిందా డేట్స్ దొరికాయి.దీంతో ఈ సినిమాను వదిలి వెళ్లాడు.

ఆగిపోయిన సినిమా దర్శకుడు అనే నెపం తన మీదకు రాకూడదని భావించి తన సోదరుల సహకారంతో సదరు నిర్మాతకు కొంత డబ్బు సెటిల్ చేశాడు.తనే ఆ సినిమా నిర్మాణాన్ని తీసుకున్నాడు. నరేష్, మనో చిత్ర హీరో, హీరోయిన్లు.80 శాతం షూటింగ్ అయిపోయాక.సాగర్ దగ్గర డబ్బులు అయి పోయాయి.సినిమా నిర్మాణాంతర పనులకు డబ్బు లేదు.అప్పుడు తన ఇంట్లో ఉన్న బంగారం, వెండి మీద పడింది ఆయన కన్ను.తన కుటుంబ సభ్యుల నుంచి సంప్రదాయంగా వస్తున్న సంపద అది.మొత్తం ఒక‌టిన్న‌ర కేజీ బంగారాన్ని తీసుకువెళ్లి కుదువ‌పెట్టాడు.ఇంకోసారి సాంగ్స్ రికార్డింగ్ కు డబ్బులేక 25 వేల కోసం 15 కిలోల వెండిని తాకట్టు పెట్టాడు.

మొత్తంగా నానా ఇబ్బందులు పడి సినిమాను పూర్తి చేశాడు.డిస్ట్రిబ్యూటర్స్ దొరక్క తానే స్వయగా ఈ సినిమాను రిలీజ్ చేశాడు.ఆర్థిక సమస్యలతో సినిమా మీద పెద్దగా మనసు పెట్టలేదు.సినిమా సరిగా రాలేదు.ఫ్లాప్ అవుతుందని అనుకున్నాడు.కానీ డిజాస్టర్ అయ్యింది.ఆర్థికంగా చాలా నష్టపోయాడు సాగర్.

కుటంబాన్ని రోడ్డు మీదకు వచ్చేలా చేశాడు.ఆ తర్వాత హిట్ సినిమాలు తీసి.

కాస్త ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసుకున్నాడు.

Unkown Facts About Director Sagar , Director Sagar, Financial Problems, Action No.1, Stuart Puram , Tollywood - Telugu Sagar, Stuart Puram, Tollywood, Unkown Sagar

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube