తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమా కనకాల( Suma Kanakala ) పేరు ముందు వరుసలో ఉంటుంది ఈమె కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు మాత్రం చాలా చక్కగా మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు.ఇక సుమ కేవలం బుల్లితెర కార్యక్రమాలపై మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినీ సెలబ్రిటీలను కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూ చేస్తూ ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటారు.
ఇందులో భాగంగానే తాజాగా రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగరాలు దాటి సైడ్ బి ( Saptha sagaralu dati side b )ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రక్షిత్ శెట్టి అలాగే హీరోయిన్లను కూడా ఇంటర్వ్యూ చేశారు.ఇక సుమ ఇంటర్వ్యూ చేస్తున్నారన్న, ఆమె ఒక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారన్నా, ఆ కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుంది సుమ ఇంటర్వ్యూ చేస్తే ఎక్కడ కూడా తప్పులు దొర్లవు అని సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈమె రక్షిత్ శెట్టిని ఇంటర్వ్యూ చేసే సమయంలో రక్షిత్ శెట్టి సినిమా గురించి సరైన వివరాలు తెలియకుండా ఈ ఇంటర్వ్యూ చేసారు దీంతో మొదటిసారి ఈమె ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయారు దీంతో కొంతమంది నేటిజన్స్ సుమపట్ల దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సుమ రక్షిత్ శెట్టి( Rakshith Shetty ) ని ఇంటర్వ్యూ చేస్తూ… ఒక సినిమాకు సీక్వెల్ చిత్రం తొందరగా రావడం మొదటిసారి.మీరు పార్ట్ వన్ రాసినప్పుడే పార్ట్ 2 కూడా స్టోరీ రాసుకున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రక్షిత్ సమాధానం చెబుతూ నేను ఈ సినిమాకి రైటర్ కాదు ఈ సినిమాకి హేమంత్ రైటర్ అంటూ సమాధానం చెప్పడంతో సుమ తెల్ల మొహం వేశారు.మరో సందర్భంలో ఇలా ఈ సినిమాకి రెండు భాగాలుగా చేస్తాము అంటే నిర్మాత ఒప్పుకున్నారా అంటూ తిరిగి హీరోని ప్రశ్నించగా వెంటనే రక్షిత్ ఈ సినిమాకు నేనే నిర్మాత అంటూ మరోసారి కౌంటర్ ఇవ్వడంతో అవునా అంటూ ఆశ్చర్యపోవడమే కాకుండా సారీ కూడా చెప్పారు.
మరో సందర్భంలో ఈమె హీరోని ప్రశ్నిస్తూ మీరు యాక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ సింగర్ అంటూ సుమ డౌటుగా అడగడంతో వెంటనే హీరోయిన్స్ స్పందిస్తూ ఈయన సింగర్ కాదు కేవలం లిరిసిస్ట్ మాత్రమే అంటూ సమాధానం చెప్పారు.ఇలా ఈ ఇంటర్వ్యూలో సుమకు అన్ని ఎదురు దెబ్బలు తగిలాయి ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎప్పుడు ఇంటర్వ్యూలలో పొరపాటు చేయని సుమా ఇంటర్వ్యూ గురించి ఏమాత్రం ప్రిపేర్ కాకుండా ఇలా ప్రశ్నలు వేయడంతో అడ్డంగా దొరికిపోయారని తెలుస్తోంది.
ఈ విషయంపై నేటిజన్స్ స్పందిస్తూ ఇలా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఇంటర్వ్యూ గురించి కొన్ని విషయాలు ముందుగా తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి కదా సుమక్క లేకపోతే ఇలా తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.