తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం చెలరేగింది.నో ఫ్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా మూడు హెలికాప్టర్లు వెళ్లాయని తెలుస్తోంది.
శ్రీవారి ఆలయం సమీపం నుంచే వెళ్లినట్లు ఆలయ అధికారులు గుర్తించారు.కాగా ఆ హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్ కు చెందినవిగా నిర్ధారించారు.
కడప నుంచి చెన్నైకి వెళ్లే ఈ హెలికాప్టర్లు తిరుమల మీదుగా వెళ్లాయని సమాచారం.అయితే దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.