కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాస్ పోర్ట్ అంశంపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.పాస్ పోర్ట్ మంజూరు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకించారు.రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని కోర్టును కోరారు.
ఒకవేళ రాహుల్ గాంధీకి పాస్ పోర్ట్ మంజూరు చేస్తే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటంకం ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అటు పాస్ పోర్ట్ జారీ కోసం ఎన్ఓసీ జారీ చేయాలని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.