ఉడతను కాపాడి, రోజూ దాని సంరక్షణ చూస్తున్నాడు.. ఎంత మంచి మనసో!

ప్రకృతి విపత్తుల సమయంలో జరిగే నష్టం అంతా ఇంతా కాదు.ఇల్లు కూలిపోయి, ప్రాణ నష్టం సంభవించి, పంటలన్నీ నాశనమై, ఇలా ఎన్నో రకాల కోలుకోలేని నష్టాలు జరుగుతాయి.

 He Saves The Squirrel And Takes Care Of It Everyday , Squirrel, Viral Latest, N-TeluguStop.com

ఆ సమయంలో బాధితుల కష్టాలు వర్ణనాతీతం.అయిన వారిని కోల్పోయి, తమకు నిలువ నీడ లేక రోదిస్తూ ఉంటారు.

ఇక ఆ సమయంలో మనుషుల బాధే దారుణంగా ఉంటే ఇక జంతువుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నోరు లేని మూగ జీవాలు, ఆకలితో, దాహంతో అలమటిస్తాయి.

వాటి బాధలను ఆ సమయంలో పట్టించుకునే నాథుడు కనపడడు.ఇదే పరిస్థితి ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో కనిపించింది.

అయితే ఓ వ్యక్తి ఉడతను సంరక్షించి, దానికి ఆహారమిచ్చి అది రోజూ ఎలా ఉందో గమనిస్తున్నాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

అమెరికాలో సుడిగాలులతో కూడిన హరికేన్‌లు తరచూ వస్తుంటాయి.అందువల్ల అక్కడి ఇళ్లను చెక్కతో నిర్మించుకుంటారు. ఒక వేళ ఇల్లు కూలినా, ప్రాణ-ఆస్తి నష్టం తక్కువగా ఉంటుందని అలా చేస్తారు.ఇక ఇటీవల ఫ్లోరిడాలో ఓ భారీ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది.

ఇల్లు కూలిపోయి, చెట్లు పడిపోయి చాలా నష్టం జరిగింది.ఆ సమయంలో ఓ ఉడత అల్లాడిపోయింది.

తన సమీపంలోకి వచ్చిన ఓ వ్యక్తి జాకెట్‌లోకి అది దూరిపోయింది.ఆ తర్వాత దానిని ఆ వ్యక్తి పడేయలేదు.

ఇంటికి తీసుకెళ్లి, దానిని సంరక్షించాడు.ఆహారం పెట్టి, తిరిగి అది మామూలు స్థితికి చేరుకోవడానికి సాయం చేశాడు.

ఆ తర్వాత అది కోలుకున్న తర్వాత తిరిగి చెట్ల వద్ద దానిని వదిలి పెట్టాడు.మామూలు మనుషులు అయితే అంతటితో తమ పని అయిపోయిందని సరి పెట్టుకుంటారు.

అయితే ఆ వ్యక్తి ఆ ఉడతను వదిలేయలేదు.రోజూ వెళ్లి దానికి ఆహారం ఇస్తున్నాడు.

అది ఎలా ఉందోనని, దాని బాగోగులు చూసుకుంటున్నాడు.దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

అతడిది మంచి మనసు అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube