వినాయక చవితి సందర్భంగా గణనాథుల విగ్రహాలు మండపాల్లో ఏర్పాటయ్యాయి.భక్తులను ఆకర్షించేందుకు కొందరు మండపాలను సుందరంగా అలంకరించగా, మరికొందరు వివిధ ఆకృతుల్లో వినాయకులను ప్రతిష్ఠించారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో ఏర్పాటైన గణేషుడు ఆకట్టుకుంటున్నాడు.వారాహి వాహనం లాంటి మండపంలో జనసేనాని గణనాథుడు ఉన్న వీడియో వైరల్ అవుతోంది.