ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్యనున్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ఘన విజయం సాధించింది.సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 277 పరుగులు చేయడం అనేది ఒక భారీ రికార్డు అనే చెప్పాలి.
ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతి లో ఓకే ఇన్నింగ్స్ లో 277 పరుగులు చేసి ఒక భారీ రికార్డును కూడా క్రియేట్ చేసింది.ఇక అందులో భాగంగానే ముంబై టీం కూడా 246 పరుగులు చేసి తనదైన రీతిలో కౌంటర్ ఎటాక్ చేసినప్పటికీ విజయం మాత్రం సాధించలేకపోయింది.

ఇక మొత్తానికైతే ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీం ఇప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొంటుందనే చెప్పాలి.ఇక హైదరాబాద్ ప్లేయర్లు అయిన అభిషేక్ శర్మ, క్లాసేన్, మార్కరం లాంటి ప్లేయర్లు బీభత్సంగా స్కోర్ లను కొడుతుంటే ముంబై ఇండియన్స్ బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు.దాంతో హార్దిక పాండ్య( Hardik Pandya ) కూడా ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియక డైలమాలో పడిపోయినట్టుగా అర్థమైంది.ఇక మొత్తానికైతే హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ మీద పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో కూడా తన కెప్టెన్సీ ఫెయిల్ అవ్వడంతో ముంబై టీం విజయాన్ని అందుకోలేకపోయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ మ్యాచ్ నుంచి హార్థిక్ పాండ్య ను కెప్టెన్ గా పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఇదే పొజిషన్ లో కనక ముంబై ఇండియన్స్ టీం తన పర్ఫామెన్స్ ను కొనసాగిస్తే మాత్రం ఈ సీజన్ లో దారుణంగా ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి… ఇక మొత్తానికైతే ఎస్ ఆర్ హెచ్ టీమ్ ఈ మ్యాచ్ లో బోణి కొట్టడం అనేది ఆ టీం యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ ని పెంచిందనే చెప్పాలి…
.