ఈ ఏడాది విడుదలై హిట్ గా నిలిచిన సినిమాలలో గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) కూడా ఒకటి.నెగిటివ్ టాక్ ను తట్టుకుని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ సినిమాలు సక్సెస్ సాధించాయి.మెజారిటీ ఏరియాలలో గుంటూరు కారం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది.
ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు మరింత బెటర్ రెస్పాన్స్ వస్తుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.హైదరాబాద్ లోని సుదర్శన్ 35ఎం.
ఎం.థియేటర్( Sudarshan 35MM Theatre ) లో గుంటూరు కారం మూవీ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంటోంది.

ఈ సింగిల్ స్క్రీన్ లో గుంటూరు కారం మూవీ 17 రోజుల్లో ఏకంగా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.సింగిల్ స్క్రీన్ లో ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువు కాదని మహేష్ బాబు గుంటూరు కారంలో హీరోగా నటించడం వల్లే ఈ రికార్డ్ సొంతమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గుంటూరు కారం సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు సైతం ఈ సినిమా కలెక్షన్లతోనే( Guntur Kaaram Collections ) సమాధానం దొరుకుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎక్కడా కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) త్వరలో కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా మరీ భారీ హిట్ సాధించని దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి మెజారిటీ హీరోలు ఆసక్తి చూపరు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్( Pawan Kalyan Trivikram Combo ) కూడా క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.పవన్ త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ కాంబినేషన్ కు సంబంధించిన ప్రకటన రావడం మరీ కష్టమైతే కాదు.