ఫైనల్ స్టేజ్ లో గుంటూరు కారం.. అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం’‘.( Guntur Kaaram ) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతటా హోప్స్ పెరిగి పోయాయి.

 Guntur Kaaram First Single Update, Guntur Kaaram , Mahesh Babu, Trivikram,-TeluguStop.com

మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి( Meenakshii Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి టీజర్ తో పాటు ఇటీవలే మహేష్ బర్త్ డే కానుకగా మాస్ పోస్టర్ రిలీజ్ చేసారు.

అంతకు మించి మరో అప్డేట్ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు మేకర్స్ అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు.అయితే ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు.

లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఫస్ట్ సింగిల్ ఫైనల్ స్టేజ్ లో ఉందట.

మిక్సింగ్ పూర్తి అయితే లిరికల్ సాంగ్ ను రెడీ చేసి మంచి టైం లో ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.చూస్తుంటే అతి త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు డిఫరెంట్ గా ఆడియెన్స్ ను అలరించగా ఇప్పుడు గుంటూరు కారం ఎలాంటి అంచనాలు అందుకుంటుందో అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈసారి ఈ కాంబో బ్లాక్ బస్టర్ కొట్టాలని వారు ఆశిస్తున్నారు.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube