ఎన్నికలు వస్తున్నాయి కదా....!

ఎన్నికలా? ఎప్పుడు? ఎక్కడ? ఏడాది క్రితమే కదా సాధారణ ఎన్నికలు జరిగాయి….! మళ్లీ ఎన్నికలేమిటి? అవును…దేశంలో ఏదో ఒక రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి.ఆయా రాష్ర్టాల అసెంబ్లీల గడువు పూర్తి కావడంబట్టి ఎన్నికలు జరుగుతుంటాయి.ఈ ఏడాది సెప్టెంబరులోనో, అక్టోబరులోనో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.అందులో భాజపా ఢమాల్‌ అంది.

 Government Will Go All Out To Support Bihar-TeluguStop.com

అధికారానికి వచ్చిన ఏడాదిలోపే ఈ పరాభవం జరిగింది.ఇక త్వరలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

దీన్ని భాజపా, దాన్ని వ్యతిరేకించే ప్రతిపక్షాలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.ఎలాగైనా బిహార్‌లో పాగా వేయాలని భాజపా ప్రయత్నాలు చేస్తోంది.

ఎన్నికల ప్రచారం కూడా ఎప్పుడో ప్రారంబించింది.ఇక అసలు విషయం ఏమిటంటే….

ఈ ఎన్నికల్లో భాజపాకు ఓట్లు రాలాలంటే భారీగా ‘వరాలు’ ప్రకటించాల్సిందే.ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అదే పని చేస్తానంటున్నారు.

బిహార్‌కు భారీఎత్తున సాయం చేస్తామని ప్రకటించారు.రాబోయే వారాల్లో కొన్ని ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాష్ర్టాలకు సాయం చేసేటప్పుడు పాలకులు ఎవరనేది తాము పట్టించుకోమని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తామని జైట్లీ చెప్పారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే జైట్లీ ఇలాంటి ప్రకటన చేశారనడంలో సందేహంలేదు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు విముఖంగా ఉన్న కేంద్రం బిహార్‌పై ప్రేమ చూపించడానికి కారణం ఎన్నికలే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube