గూగుల్ హెచ్చరిక: మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఆ యాప్స్ ఉంటే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి..!

మన కంటితో చూసేది ఏది నిజం కాదు.ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనే సామెత గురించి మీరు వినే ఉంటారు.

 Google Alert Immediately Uninstall These Harmful Apps From Your Android Mobile ,-TeluguStop.com

అందుకే దేన్నీ కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అంటారు పెద్దవాళ్ళు.అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనుకుంటున్నారా.? దానికి ఒక కారణం ఉంది అండి.అది ఏంటో తెలుసుకుని మీతోపాటు మీ ఫోన్ ను కూడా జాగ్రత్తగా ఉంచుకోండి.

ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోను విరివిగా ఉపయోగిస్తున్నారు.అలాగే కనిపించిన ప్రతి యాప్స్ ను కూడా డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు.

కానీ అది చాలా పొరపాటు.గూగుల్ ప్లేస్టోర్ లో ఉండే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ సేఫ్ అనుకుంటే పొరపాటు పడినట్లే అని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ హెచ్చరిస్తున్నారు.

అలాగే మాల్వేర్ విశ్లేషణ సంస్థ కొన్ని ఆండ్రాయిడ్ యాప్ లను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేయవద్దని చెబుతోంది.సైబర్ భద్రత దృష్ట్యా ఈ 9 యాప్ లను గూగుల్ బ్యాన్ చేసింది.

మరి మీ స్మార్ట్ ఫోన్ లో కనుక ఈ యాప్స్ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది.లేదంటే సైబర్ నేరగాళ్ల చేతికి మీ డేటా మొత్తం వెళ్ళిపోతుందని అంటున్నారు.

ఇంతకీ గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా.

Telugu Andorid, Google, Horoscope, Lock Master, Marwell Apps, Pip, App, Uninstal

1) పీఐపీ ఫొటో – PIP Photo

2)ప్రాసెసింగ్ ఫొటో – Processing Photo

3)ఇన్ వెల్ ఫిట్ నెస్ – Inwell Fitness

4)రబ్బిష్ క్లీనర్ – Rubbish Cleaner

5)యాప్ లాక్ కీప్ – App Lock Keep

6) హారోస్కోప్ డైలీ – Horoscope Daily

7)హారోస్కోప్ పై – Horoscope Pi

8)లాక్ ఇట్ మాస్టర్ – Lockit Master

9) యాప్ లాక్ మేనేజర్ – App Lock Manager

Telugu Andorid, Google, Horoscope, Lock Master, Marwell Apps, Pip, App, Uninstal

ఈ యాప్స్ ను గూగుల్ తాజాగా నిషేదించింది.ఒకవేళ మీ ఫోన్ లో ఉంటే డిలీట్ చేయండి.ఈ తొమ్మిది యాప్స్ వల్ల యూజర్లకు ప్రమాదకరం అని డాక్టర్ వెబ్ తెలిపారు.

ఈ యాప్స్ అన్నీ గతంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండేవని, అప్పట్లో వాటిపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది.ఈ యాప్స్ అన్నీ ట్రోజన్ వైరస్ తరహా యాప్స్.

చూడడానికి సాధారణంగా కనిపించే కొన్ని లింకుల సాయంతో ప్రమాదకరమైన కొన్ని జావా స్క్రిప్టులను పంపి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఆ సమాచారాన్ని సదరు యాప్ లు సైబర్ నేరగాళ్ల సర్వర్ లకు చేరవేస్తాయి.ఏది ఎలా ఉన్న గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube