బాలీవుడ్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం లేని అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని 15 నిమిషాల నిడివి గల పాత్రతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు.ఎన్టీఆర్30 సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని సొంతం చేసుకున్న అలియా భట్ కొన్ని రీజన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పగా ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ లో మరో హీరోయిన్ ఫైనల్ కాలేదు.
గతంలో అలియాకు ఉన్న సమస్యలు తొలగిపోవడంతో అలియా భట్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ కోరిక విషయంలో ఈ సినిమా మేకర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.కొన్ని రోజుల క్రితం అలియా భట్ పండంటి పాపకు జన్మనిచ్చారు.
ఏడు నెలలకే అలియా భట్ తల్లి ఎలా అయ్యారని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా ఏడు నెలలకే బిడ్డకు తల్లి అయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారని అలియా భట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే పాప పుట్టిన తర్వాత అలియాకు అదృష్టం కలిసొచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలోనే అలియా భట్ కొత్తింట్లో కాపురం పెట్టాలని భావించగా కొన్ని కారణాల వల్ల ఆమె కోరిక నెరవేరలేదు.కొత్తింట్లో కాపురం పెట్టాలని అనుకున్న సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.
అయితే పాప జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ అడ్డంకులు, ఇబ్బందులు తొలగిపోవడంతో అలియా భట్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం.
త్వరలోనే అలియా భట్ కొత్తింటికి మారనున్నారని తెలుస్తోంది.అదే సమయంలో కెరీర్ విషయంలో కూడా మరింత ఎదిగే దిశగా అలియా భట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ ఏడాది వరుస సక్సెస్ లతో సక్సెస్ రేట్ పెంచుకున్న అలియా భట్ త్వరలో మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నట్టు ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది.